MLC Kavitha : తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తీన్మార్ మల్లన్నపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అధికారికంగా ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, అసభ్య వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంటూ, మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సంస్కృతిలో మహిళలకు ప్రత్యేక గౌరవం ఉంటుందని, బోనం ఎత్తే ఆడబిడ్డలను అమ్మవారిలా చూస్తామన్నారు. అలాంటి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ బాధ్యత…
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మలన్న విజయం దాదాపు ఖరారైనట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్‌కుమార్(తీన్మార్ మల్లన్న) ఆధిక్యంలో ఉన్నారు.
Teenmar Mallanna: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది.
ఎప్పుడూ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగే తీన్మార్ మల్లన్న ఇక నుంచి తాను సీఎం కేసీఆర్‌ను తిట్టనని శపథం పూనారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిన్న నిర్వహించిన ‘7200 మూవ్‌మెంట్’ సన్నాహక సమావేశానికి తీన్మార్ మల్లన్న హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై కేసీఆర్‌ను తిట్టబోనని ఒట్టేసి చెబుతున్నానని, అయితే, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయే వరకు మాత్రం తన ‘7200 మూవ్‌మెంట్’ ద్వారా పోరాడతానని ప్రకటించారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడమే తన…
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నడుస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య ఘాటైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ కుటుంబంపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. తీన్మార్ మల్లన్న పై బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై మరోసారి మాట్లాడితే ముక్కలుగా నరికేస్తానన్నారు. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే.. మూడు వందల ముక్కలుగా నరికేస్తాం. ఎక్కువ మాట్లాడితే…
తెలంగాణలో యూట్యూబ్ ఛానెళ్ళు లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయాయి. వాటిపై నియంత్రణ కూడా వుండడం లేదు. దీంతో యూట్యూబ్ వార్తా చానెళ్లకు ముకుతాడు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగిస్తోంది. యూట్యూబ్ చానెళ్లు చేస్తున్న అభ్యంతరకర ప్రసారాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అసత్య, విద్వేషపూరిత వార్తలు ప్రసారాలు చేయడం, మతాలు, కులాల మనోభావాలను దెబ్బతీయడం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం వుంది. రాజకీయంగా కొందరిని టార్గెట్ చేసుకుని కామెంట్లు, పోల్స్ పెట్టి వ్యక్తిగత, కుటుంబ…
బిజెపి నేత చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు చెందిన ఓ మీడియా సంస్థ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ప్రస్తావనతో ట్విటర్‌లో ఓ పోల్ క్వశ్చన్‌ను పోస్ట్ చేసింది. బాడీషేమింగ్‌తో కూడిన ఆ పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. దీనిపై హిమాన్షు తండ్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కేటీఆర్ సోదరి కవితతో పాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ తదితరులు ఖండించారు.…
తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న చేసిన పని… దుర్మార్గమని విమర్శించారు. చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ Q న్యూస్ లో ‘పోల్’ పేరిట రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ”బాడీ షేమింగ్” కు పాల్పడడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని అల్లం నారాయణ పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానల్ పేరిట వాడుతున్న భాష జర్నలిజం ప్రమాణాలకు…
తీన్మార్ మల్లన్న కేటీఆర్ కొడుకు హిమాన్షుపై అనుచిత పోల్ నిర్వహించడంపై టీఆర్‌ఎస్ మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ ..మల్లన్నను హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా ఇప్పటికే కేటీఆర్ మల్లన్న పై కేసు కూడ నమోదు చేశారు. మరోవైపు ఈ అంశాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలకు ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేసిన విషయం తెల్సిందే.. అయితే ఈ అంశంపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పందిస్తూ కొందరు బుద్ధి లేకుండా చిన్న పిల్లలపై అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని, తాము ప్రభుత్వంలో ఉన్నాం…
తీన్మార్ మల్లన్న వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తీన్మార్ మల్లన్నను ఉరికించి కొట్టాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఆయన జర్నలిస్ట్ కాదు…బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడని మండిపడ్డారు. మంత్రి కెటిఆర్ కుమారుడి గురించి ఇష్టారాజ్యాంగ మాట్లాడుతాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కెటిఆర్ ఫ్యామిలీ మీద మరొక్కసారి మాట్లాడితే మా గులాబీ సైన్యం బట్టలూడదీసి కొడతుందని హెచ్చరించారు. మా నేత కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మా అభిమానులు ఊరుకుంటారా అని…