ఈమధ్యే బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్నపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు మంత్రి కేటీఆర్. తన కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న ట్వీట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బంజారా హిల్స్ ఏసీపీకి టీఆర్‌ఎస్ సోషల్ మీడియా టీం ఫిర్యాదు చేసింది. కేటీఆర్ కొడుకు హిమాన్షుపై ట్విటర్‌లో పెట్టిన పోస్టుకు కోపంతో ఊగిపోయిన కొంతమంది టీఆర్‌ఎస్ సానుభూతిపరులు తీన్మార్ మల్లన్నపై దాడికి పాల్పడ్డారు. మల్లన్న ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ ఖండించారు. బీజేపీ మీడియా నాయకులు…
తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ అసహానం వ్యక్తం చేశారు. తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను ఇందులోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా..? హిమాన్షు శరీరంలోనా..? అంటూ తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడం పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు…
తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. ఈసందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదు. 15 మీటర్ల తాడు…ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపనికి కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావును కట్టేస్తా. అమర వీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తా. ప్రపంచంలో అత్యంత మోసకారి కేసీఆర్. ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే. ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయి. తాడు తీసుకొచ్చేందుకే ఢిల్లీ వచ్చాను. నాపై 38 కేసులు పెట్టారు. ఏం సాధించారు. పోలీసులు…
తెలంగాణలో కమలం పార్టీ తన బలాన్ని క్రమంగా పెంచుకుంటోంది. ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిన తర్వాత ఆ పార్టీలోకి వలసలు పెరిగాయి. ఇప్పటికే పలువురు కాషాయ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. మంగళవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. Read Also: బీజేపీలోకి తెలంగాణ ఉద్యమ నేత…
తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ బలపడేందుకు ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి అసంతృప్తులను బీజేపీలో చేర్చుకునేందుకు బీజేపీ పార్టీ ప్రణాళికలను సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఆ పార్టీల్లో పలువురు నేతల్ని బీజేపీ ఈమ పార్టీలో కి చేర్చుకోవాలని భావిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసుకునే యోచనలో బీజేపీ ఉంది. దీనిపై ఆపార్టీ నాయకులే .. మేం నేతలను చేర్చుకుని తెలంగాణలో బలపడతామని బహిరంగంగానే…
ప్రముఖ న్యూస్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. సోమవారం సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్న ఆగస్టులో అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. Read Also: శంషాబాద్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు…
తీన్మార్ మల్లన్న అరెస్ట్ అయ్యారు. మల్లన్న అలియాస్ చింత పండు నవీన్ ను అర్థరాత్రి అరెస్ట్ చేశారు చిలకలగూడ పోలీసులు. తీన్మార్ మల్లన్న తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ. 30 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసాడని, ఇవ్వక పోయేసరికి తనను బ్లాక్ మెయిల్ చేశాడంటూ ఫిర్యాదు చేశాడు జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్ శర్మ. ఈ మేరకు ఇప్పటికే తీన్మార్ మల్లన్న…