ఆల్రెడీ మొబైలో రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన షావోమి సంస్థ.. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ ఫ్యాన్‌ను లాంచ్ చేసింది. చూడ్డానికి మనం రెగ్యులర్‌గా వినియోగించే టేబుల్ ఫ్యాన్‌లాగే అనిపిస్తుంది. కానీ, ఇందులో దిమ్మతిరిగే అధునాతన ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. షావోమి స్మార్ట్ స్టాండింగ్ ఫ్యాన్ 2 పేరుతో వస్తోన్న ఈ ఫ్యాన్‌లో అలెక్సా, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఈ ఫ్యాన్ ఆన్ చేయడానికి గానీ, ఆఫ్…
జనాలని బురిడీ కొట్టించి, డబ్బులు దండుకోవడానికి సైబర్ నేరగాళ్లు పన్నుతున్న వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. రకరకాల యాప్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా.. ఏదైతే ట్రెండింగ్‌లో ఉంటుందే, దాన్నే ఆయుధంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు వీరి కన్ను ‘వాట్సాప్’పై పడింది. ఈ మెసేజింగ్ యాప్‌ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తారన్న సంగతి తెలిసిందే! దీన్నే ఆసరాగా చేసుకొని.. వాట్సాప్‌ని పోలి ఉండే నకిలీ యాప్స్ తయారు చేస్తూ, మోసాలకు తెగిస్తున్నారు. గతంలోనూ ఈ పన్నాగాలు పన్నారు.…
చైనాకు చెందిన ఒప్పో, వన్ ప్లస్ ఫోన్లపై జర్మనీ నిషేధం విధించింది. నోకియా కంపెనీ పేటెంట్ హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన మాన్‌హీమ్ రీజినల్ కోర్టు ఆదేశాలతో జర్మనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూరప్ వ్యాప్తంగా నోకియా సంస్థ 5G నెట్‌వర్క్‌లో వైఫై కనెక్షన్లను స్కానింగ్ చేసే టెక్నాలజీపై పేటెంట్ హక్కులను కలిగి ఉంది. దీని కోసం నోకియా సుమారు 129 బిలియన్ యూరోలను పెట్టుబడిగా పెట్టింది. అయితే ఒప్పో, వన్ ప్లస్…
ఇప్పుడంతా స్మార్ట్ టీవీల హవానే నడుస్తోంది. సాధారణ టీవీల కాలం చెల్లిపోవడంతో.. అందరూ స్మార్ట్ టీవీలే కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కంపెనీలు అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలకే టీవీలను రిలీజ్ చేస్తున్నాయి. వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి, ఇతర సంస్థలకు ధీటుగా పోటీ ఇవ్వడానికి.. ఫీచర్లు పెంచుతూ, ధరల్ని క్రమంగా తగ్గిస్తున్నాయి. ఇప్పుడు ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ థామ్సన్ లేటెస్ట్‌గా చౌక ధరకే ఓ స్మార్ట్ టీవీని ఇండియాలో రిలీజ్ చేసింది. ఆల్ఫా సిరీస్‌లో భాగంగా ఆ సంస్థ విడుదల…
మార్కెట్లోకి రకరకాల స్మార్ట్ వాచ్ లు వచ్చిపడుతున్నాయి. యువత మెచ్చేలా రియల్ మీ సంస్థ ఆర్ 100 స్మార్ట్ వాచ్ విడుదలచేయడానికి రంగం సిద్ధమయింది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూ టూత్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ వాచ్ నుంచి కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆర్ 100 స్మార్ట్ వాచ్ ఎప్పుడు విడుదల చేసేది కూడా రివీల్ చేసింది. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12.30 కి వాచ్ విడుదల కానుంది. రియల్ మీ సంస్థ…
పెట్రోలు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో జనాలందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు మళ్లారు. ఈ క్రమంలోనే కంపెనీలు ఒకదానికి మించి మరొకటి మోడల్స్‌ను రంగంలోకి దింపుతున్నాయి. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలుగా స్కూటర్స్‌ని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా బ్యాట్రీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ (battRE storie electric scooter) రంగంలోకి దిగింది. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్కసారి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే, 132 కి.మీల దూరం ప్రయాణించవచ్చు. ఈ విషయాన్ని…
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఉపయోగించే వారిలో చాలా మంది ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. అయితే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఫేస్‌బుక్‌లో కీలకమార్పులు జరగబోతున్నాయి. బ్లూరంగులో కనిపించే ఫేస్‌బుక్ టికర్ ఇకపై కనిపించదు. దాని స్థానంలో మెటా టికర్, లోగోను త్వరలో తీసుకురాబోతున్నామని మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఆ టికర్‌తోనే ట్రేడింగ్ చేస్తామని అమెరికా స్టాక్‌మార్కెట్ నాస్‌డాక్‌కు తెలిపారు. 2004లో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ను ప్రారంభించగా 2012లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. ఆ సమయంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన టికర్, లోగోనూ…
ఫోటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇప్పటికే వాట్సాప్, ఫేస్ బుక్‌లలో మనకు నచ్చిన పోస్టులను ఎలాగైతే పిన్ చేసుకునే అవకాశం ఉందో.. అదే అవకాశం, సదుపాయం ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అందబాటులోకి వచ్చింది. ఈ మేరకు పిన్ టు యువర్ ప్రొఫైల్ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌ను వాడటం ద్వారా మనకు సంబంధించిన మూడు ఫోటోలు లేదంటే రీల్స్‌ను మన ప్రొఫైల్‌కు అటాచ్ చేయవచ్చు. ఈ…
దేశంలో మొబైల్ వాడేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో తమకు నచ్చిన, అందుబాటులో ఉండే నెట్‌వర్క్‌ను మొబైల్ యూజర్లు ఎంచుకుంటున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే మార్కెట్‌లో బాగా పోటీపడుతున్న జియో, ఎయిర్‌టెల్‌కు తోడుగా ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా పలు ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా కేవలం రూ.100 కన్నా తక్కువగా ఉండే మూడు ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. రూ.87 ప్లాన్: బీఎస్ఎన్ఎల్ తెచ్చిన రూ.100లోపు ప్లాన్‌లలో ఇది తక్కువ. ఎంతోమంది యూజర్లకు ఈ…
వాట్సాప్‌లో పెద్ద వీడియో ఫైల్స్ షేర్ చేసుకోవడం పెద్ద సమస్య అయిపోతోంది. కేవలం 100 MB లోపు ఫైల్స్‌ను మాత్రమే పంపించుకునే వెసులుబాటు ఉంది. దీంతో చాలామంది యూజర్లు పెద్ద ఫైల్స్‌ను పంపించేందుకు ఇతర మెసెజింగ్ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. ఈ సమస్యను గమనించిన వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2GB వరకు సైజ్ కలిగిన ఫైల్స్‌ను పంపించుకునే ఛాన్స్ ఇచ్చింది. అంటే ఓ సినిమా మొత్తం పంపించుకోవచ్చు. ఈ ఫీచర్‌ను అర్జెంటీనాలో తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా పరీక్షించింది.…