ఫోటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇప్పటికే వాట్సాప్, ఫేస్ బుక్‌లలో మనకు నచ్చిన పోస్టులను ఎలాగైతే పిన్ చేసుకునే అవకాశం ఉందో.. అదే అవకాశం, సదుపాయం ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అందబాటులోకి వచ్చింది. ఈ మేరకు పిన్ టు యువర్ ప్రొఫైల్ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌ను వాడటం ద్వారా మనకు సంబంధించిన మూడు ఫోటోలు లేదంటే రీల్స్‌ను మన ప్రొఫైల్‌కు అటాచ్ చేయవచ్చు.
ఈ రకంగా మూడు ఫోటోలు లేదంటే రీల్స్‌ను గ్రిడ్‌లో టాప్ ప్లేస్‌లో పెట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది. తమ ప్రొఫైల్‌ను సందర్శించే వారికి, యూజర్లు తమకు నచ్చిన మూడు ఫోటోలు లేదంటే రీల్స్‌ను చూపించడానికి ఈ కొత్త ఫీచర్ సహాయపడుతుంది. మీకు నచ్చిన ఫోటో లేదంటే రీల్‌ను పిన్ చేయాలనుకుంటే లేదా మీ ప్రొఫైల్‌ను ఇతరులు చూసినప్పుడు టాప్‌లో కనిపించాలనుకుంటే మీరు ఏదైనా ఫోటోని లేదంటే రీల్‌ను సెలెక్ట్ చేయాలనుకుంటే దాని టాప్ రైట్ కార్నర్ ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి పిన్ టు యువర్ ప్రొఫైల్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. దీంతో మీ పోస్ట్ మీ ప్రొఫైల్‌కు పిన్ అవుతుంది. ఇకపై కొత్తగా ఏం పోస్ట్ చేసినా ముందుగా మీరు పిన్ చేసిన ఫోటోలు లేదంటే రీల్స్ కనిపిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ కొత్త ఫీచర్ కనిపించకపోతే వెంటనే గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి అక్కడ యాప్ అప్‌డేట్ చేసుకోవాలి.