ఇప్పుడంతా స్మార్ట్ టీవీల హవానే నడుస్తోంది. సాధారణ టీవీల కాలం చెల్లిపోవడంతో.. అందరూ స్మార్ట్ టీవీలే కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కంపెనీలు అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలకే టీవీలను రిలీజ్ చేస్తున్నాయి. వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి, ఇతర సంస్థలకు ధీటుగా పోటీ ఇవ్వడానికి.. ఫీచర్లు పెంచుతూ, ధరల్ని క్రమంగా తగ్గిస్తున్నాయి. ఇప్పుడు ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ థామ్సన్ లేటెస్ట్‌గా చౌక ధరకే ఓ స్మార్ట్ టీవీని ఇండియాలో రిలీజ్ చేసింది. ఆల్ఫా సిరీస్‌లో భాగంగా ఆ సంస్థ విడుదల చేసిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర కేవలం రూ. 10 వేల లోపే!
నిన్నటిదాకా ఆ ధరలో ఎల్‌ఈడీ టీవీలు వచ్చేవి. వాటిని స్మార్ట్ టీవీలుగా మార్చాలంటే.. మరో డివైజ్ రెండు నుంచి మూడు వేలు వెచ్చించి కొనాలి. కానీ.. థామ్సన్ అందుకు భిన్నంగా రూ. 10 వేల లోపే స్మార్ట్ టీవీని రిలీజ్ చేయడం విశేషం. ఎస్‌బీఐ కార్డుతో ఈ టీవీని కొనుగోలు చేస్తే.. 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదే యాక్సిస్ బ్యాంక్ కార్డుతో ఫ్లిప్‌కార్ట్ కొంటే.. 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ ఆఫర్‌తో ఈ స్మార్ట్ టీవీని రూ.8,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఉచితంగా గానా ప్లస్ మెంబర్‌షిప్ కూడా లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయాలనుకునేవారికి.. రూ.490 నుంచి ఈఎంఐ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ టీవీ ఫీచర్స్ విషయానికొస్తే.. బెజెల్ లెస్ డిజైన్‌తో 60Hz రిఫ్రెష్ రేట్‌తో హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే ఉంది. యూట్యూబ్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5 లాంటి యాప్స్ ప్రీలోడెడ్‌గా వస్తాయి. మీరాక్యాస్ట్, బ్లూటూత్, వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 512ఎంబీ ర్యామ్ ఉండగా, 4జీబీ స్టోరేజ్ ఉంది. రెండు స్పీకర్స్ ఉండగా.. 30వాట్ సౌండ్ ఔట్‌పుట్ లభిస్తుంది. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పని చేసే ఈ స్మార్ట్ టీవీలో.. గూగుల్ క్రోమ్‌క్యాస్ట్ ఇన్‌బిల్ట్‌గా లభిస్తుంది.