ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు శాంసంగ్, వన్‌ప్లస్ వినియోగదారులకు క్షమాపణలు చెప్పాయి. స్మార్ట్ ఫోన్‌లలో యాప్ థ్రాట్లింగ్ జరుగుతుండటంపై సదరు కంపెనీలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఫోన్‌లలో గేమింగ్ పర్ఫార్మెన్స్ పెంచడడం కోసం సదరు సంస్థలు ప్లే స్టోర్‌లలోనే వివిధ యాప్‌ల పనితీరు సామర్థ్యాన్ని తగ్గించి చూపెడుతున్నాయి. దీంతో బ్యాటరీ లైఫ్‌ను పెంచడంతో పాటు గేమ్‌లకు అనువుగా సాఫ్ట్‌వేర్‌ను మరింత శక్తివంతంగా మారుస్తున్నాయి. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22తో పాటు గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8…
దేశంలో ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు సంబంధించి ఓ స్కాం తాజాగా వెలుగు చూసింది. టెలిగ్రామ్‌ను ఉపయోగించుకుని షేర్ల ట్రేడింగ్ కుంభకోణానికి పలు సంస్థలు తెరతీశాయని ఆరోపణలు రావడంతో సెబీ రంగంలోకి దిగింది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో సెబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆయా సంస్థలు టెలిగ్రామ్ ద్వారా 50 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్ల కోసం రికమండేషన్లు అందించినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన లిస్టెడ్ షేర్లకు సంబంధించి సలహాలు ఇవ్వడం ద్వారా ఇన్వెస్టర్లు…
ఈరోజు మహిళా దినోత్సవం. నిజం చెప్పాలంటే ఏదో ఒక రోజు కాదు. ప్రతి రోజు స్త్రీమూర్తులదే. తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా మమతానురాగాలు పంచే స్త్రీమూర్తికి ప్రతిరోజూ మహిళా దినోత్సవమే. మాతృదేవోభవ,పితృదేవోభవ,ఆచార్యదేవోభవ,అతిధిదేవోభవ అని “స్త్రీ”ని ఉపనిషత్తులో అందరికంటే అగ్రపూజ అందవలసిన మాతృమూర్తిగా అభివర్ణించారు.స్త్రీ అను పదములో ‘స’కార, ‘త’కార, ‘ర’కారములున్నాయి. ‘ స’ కారము సత్వగుణానికి,’త’ కారము తమోగుణానికి, ‘ర’ కారము రజోగుణానికి ప్రతీకలుగా మన పెద్దలు చెబుతారు. ప్రకృతికి ప్రతీకగా స్త్రీని చెబుతారు. నేడు స్త్రీలు…
దేశంలో ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా 5జీ టెలికాం సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు 2022, ఆగస్టు 15 కల్లా 5జీ సేవలు ప్రారంభమయ్యేలా చూడాలని ప్రధానమంత్రి కార్యాలయం టెలికాం శాఖను ఆదేశించింది. దీంతో 5జీ స్పెక్ట్రానికి సంబంధించిన సిఫార్సులను మార్చికల్లా అందించాలని టెలికాం శాఖ ట్రాయ్‌ను కోరింది. వివిధ బ్యాండ్‌లలో లభ్యమయ్యే స్పెక్ట్రంను వేలం వేసేందుకు ధరలు, పరిమాణం, ఇతర షరతులకు సంబంధించిన సిఫార్సులను ట్రాయ్ చేయనుంది. అటు అల్ట్రా హైస్పీడ్…
గూగుల్ సంస్థ గతేడాది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ను రూపోందించిన సంగతి తెలిసిందే. ఈ ఓఎస్ 12 ఇప్పటికే పూర్తి స్థాయిలో యూజర్లకు అందలేదు. ఆండ్రాయిడ్ 12 వెర్షన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే మరో కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే గూగుల్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం డెవలపర్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. Read: Live: ఏపీ రహదారులకు మహర్దశ… ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌లో గూగుల్ నోటిఫికేషన్‌లోని…
టెక్నాలజీ అభివృద్ది చెందిన తరువాత మనిషి తన అవసరాల కోసం, ప్రపంచం మనుగడ కోసం రోబోలను తయారు చేశాడు. ఈ రోబోలు మనిషికి అన్ని రంగాల్లోనూ సహకరిస్తున్నాయి. కృత్రిమ మేధతో తయారైన రోబోలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా రోబోలకు ఉంటుందనడంలో సందేహం అవసరం లేదు. మనుషులు ఆలోచించిన విధంగానే రోబోలు కూడా ఆలోచించగలిగితే మనిషి మనుగడకే ప్రమాదం కావొచ్చు. ఇక ఇదిలా ఉంటే 2021లో చాలా…
ఈరోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగినా కొన్ని సాంకేతిక పరమయిన ఇబ్బందులు తప్పడం లేదు. హ్యాకర్లు మనమీద ఓ కన్నేసి వుంచుతున్నారు. అవకాశం చిక్కితే మన సొమ్ము లాగేయడానికి సిద్ధంగా వుంటారు. వీక్ పాస్ వర్డ్ ల విషయంలో ముందువరుసలో భారత్ ఉంది. సులభమైన పాస్‌వర్డ్స్ వాడుతుండటం వల్ల హ్యాకర్లు మీ డేటాను సులభంగా తస్కరించే ప్రమాదం వుంది. పాస్‌వర్డ్స్ విషయంలో మనల్ని అప్రమత్తం చేసేందుకు గూగుల్ క్రోమ్ తనవంతు పాత్ర పోషిస్తోంది. మన ఆన్‌లైన్ ఖాతాలకు సెట్…
ఏదైనా ఇంటర్య్వూకు హాజరుకావాలంటే చేతిలో రెజ్యూమ్ తీసుకొని వెళ్లాల్సిందే. ఎంత చిన్న లేదా పెద్ద కంపెనీ అయినా ఈ ప్రాసెస్ తప్పనిసరి. అయితే, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండబోవని అంటున్నారు సభీర్ భాటియా. హాట్ మెయిల్ గురించి తెలిసిన వారికి సభీర్ భాటియా గురించి తెలుసు. హాట్ మెయిల్‌ను సృష్టించిన తరువాత ఆ మెయిల్ వ్యవస్థను మైక్రోసాఫ్ట్ కంపెనీ కొనుగోలు చేసింది. ఇప్పుడు హాట్ మెయిల్‌లో ఎన్నో మార్పులు చేసింది మైక్రోసాఫ్ట్. Read: వైరల్: భూమిపై…
అమెరికా అంటే అభివృద్ది చెందిన టెక్నాలజీ, భారీ కట్టడాలు, పబ్ కల్చర్, ఫాస్ట్ లైఫ్. అన్నింటికీ మించి అధికమొత్తంలో శాలరీలు. అందుకే ప్రతి ఒక్కరూ అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ కావాలని అనుకుంటారు. అటువంటి అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో అభివృద్ధికి దూరంగా, టెక్నాలజీ లేకుండా, ఇంటర్నెట్, సెల్ ఫోన్ సౌకర్యాలు లేకుండా ఉన్న గ్రామం ఒకటి ఉన్నది. ఆ గ్రామం పేరు సుపాయ్. ఈ గ్రామం గ్రాండ్ కాన్యన్ అనే లోతైన లోయల్లో ఉన్నది. ఈ…
క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా క్లాప్ కార్యక్రమం కింద ఇప్పటివరకూ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించారు ఏపీ సీఎం జగన్. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు. వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలన్నారు. కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకురావాలని, ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను వీలైనంత త్వరగా తెప్పించుకోవాలన్నారు. గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుంచి సమీప ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు గార్బేజ్‌ను తొలగించడమే…