VVS Laxman Extended his NCA Head: భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించనున్నారు. లక్ష్మణ్ మూడేళ్ల కాంట్రాక్ట్ వచ్చే నెల సెప్టెంబర్‌తో ముగియనుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు అతను ఓ ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్ గా మారవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే., ఈ అవకాశాలన్నింటినీ తిరస్కరిస్తూ.. ఎన్సీఏ చీఫ్‌గా తన పదవీకాలాన్ని పొడిగించే ప్రతిపాదనను లక్ష్మణ్ అంగీకరించారు.…
Team India Schedule: జూన్ నెలలో టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన తర్వాత, భారత జట్టు జింబాబ్వే, శ్రీలంకలో పర్యటించింది. ఇప్పుడు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీమిండియా టెస్టు, టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. శ్రీలంక పర్యటనలో భారత జట్టు ఆగస్టు 7న చివరి వన్డే ఆడింది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో తదుపరి టెస్టు మ్యాచ్ జరగనుంది. కాగా భారత జట్టుకు 42 రోజుల విరామం లభించింది. అయితే., బంగ్లాదేశ్ సిరీస్ నుంచే అసలు విషయం మొదలవుతుంది.…
వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో తన తోటి బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌ను వెనక్కి నెట్టి రెండవ స్థానాన్ని సాధించాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ గా కొనసాగుతున్నాడు.
టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ సెలక్ట్ అయినట్లు క్రిక్ బజ్ (Cricbuzz) తెలిపింది. ఆయన నియామకంపై త్వరలోనే బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ రికమెండ్ చేయడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోర్కెల్ సెప్టెంబర్ 1 నుంచి బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం.
IND vs BAN Schedule: గత ఏడాది కాలంగా వరుస మ్యాచ్‌లు ఆడుతున్న భారత ఆటగాళ్లకు భారీగా సెలవులు దొరికాయి. దాదాపుగా 40 రోజుల విశ్రాంతి లభించనుంది. గత కొన్ని నెలలుగా భారీ షెడ్యూల్‌తో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లకు ఈ 40 రోజుల విశ్రాంతి భారీ ఉపశమనం కలిగించనుంది. శ్రీలంక పర్యటన అనంతరం స్వస్థలాలకు వెళ్ళిపోయిన ప్లేయర్స్.. కుటుంబంతో కలిసి సరదాగా గడపనున్నారు. విదేశీ టూర్స్ వేసే అవకాశం కూడా ఉంది. ఇటీవల ముగిసిన శ్రీలంక…
పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా 2-1తో స్పెయిన్‌ను ఓడించి ఒలింపిక్స్‌లో వరుసగా రెండో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
ICC Player Of July Month Washington Sundar: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జూలై నెలలో ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ గా భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను ఎంపిక చేసింది. గత నెలలో జరిగిన టీ 20 సిరీస్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అద్భుతాలు చేశాడు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ శ్రీలంక టూర్ లో టీమిండియాతో ఉన్నాడు. ఇక ఈ అవార్డుకు అతనితో పాటు.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు చెందిన…
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి ఒక ముఖ్యమైన వార్త బయటకు వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ పాకిస్థాన్‌కు రూ.586 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఈసారి టోర్నీని పాకిస్థాన్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు టీమిండియా సిద్ధంగా లేకపోవడంతో.. భారత్ మ్యాచ్‌లు శ్రీలంక లేదా యూఏఈలో నిర్వహించవచ్చు. ఈ టోర్నీకి సంబంధించి తాజాగా ఐసీసీ బడ్జెట్ ను కేటాయించింది. అయితే దీనికి సంబంధించి…
మహిళల ఆసియా కప్‌లో భాగంగా.. ఈరోజు బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 81 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఓపెనర్లు కేవలం 11 ఓవర్లలోనే ఛేదించారు. భారత్ ఓపెనర్లు స్మృతి మంధాన (55*), షఫాలీ వర్మ (26*) పరుగులు చేశారు. దీంతో.. భారత జట్లు ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.