ENG vs NZ: క్రికెట్‌కు పుట్టినిల్లుగా చెప్పుకునే ఇంగ్లాండ్ టీమ్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 147 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో 5 లక్షలకు పైగా రన్స్ చేసిన మొదటి జట్టుగా ఇంగ్లీష్ టీమ్ అవతరించింది. కాగా, ఓవరాల్‌గా ఇంగ్లాండ్‌కిది 1,082వ టెస్టు మ్యాచ్ అని చెప్పాలి. ఈ జాబితాలో ఇంగ్లాండ్ తర్వాత ఆస్ట్రేలియా టీమ్ 4,28,868* పరుగులతో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది. కాగా, భారత జట్టు 2,78,751 రన్స్ తో మూడో స్థానంలో ఉంది.
Read Also: Ration Mafia : ఏపీలో రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన సిట్
అయితే, కివీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ లీడ్ సాధించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లీష్ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 378/5 పరుగులతో ఉంది. దీంతో ఆధిక్యం 533 పరుగులకు చేరిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 125 రన్స్‌కే కుప్పకూలిపోగా.. ఇంగ్లండ్ 280 పరుగులు చేసి.. మూడు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్ ఇంగ్లండ్ కైవసం చేసుకుంటుంది. ఇంకా 3 రోజుల సమయం ఉండటంతో పాటు భారీ లక్ష్యం ఛేధిస్తే తప్పా.. న్యూజిలాండ్ గెలవడం అసాధ్యమని చెప్పాలి.