WTC 2025 Final: టీమిండియాకు బిగ్ షాక్.. అగ్రస్థానానికి దక్షిణాఫ్రికా జట్టు
- శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 109 పరుగుల తేడాతో విజయం
- 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న సౌతాఫ్రికా
- డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన దక్షిణాఫ్రికా
- రెండో స్థానంలో ఆస్ట్రేలియా, మూడో స్థానంలో కొనసాగుతున్న భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 109 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో చాలా లాభపడింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకుంది.
దక్షిణాఫ్రికా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది:
అడిలైడ్‌లో భారత జట్టును ఓడించిన ఆస్ట్రేలియా WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే కంగారూ జట్టు ఈ ప్రస్థానం ఎంతో సమయం ఉండలేదు. మరుసటి రోజు దక్షిణాఫ్రికా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుత సైకిల్‌లో దక్షిణాఫ్రికా 10 మ్యాచ్‌లలో 6 గెలిచింది. 3 ఓడిపోగా, ఒక మ్యాచ్ డ్రాగా నిలిచింది. దక్షిణాఫ్రికా 76 పాయింట్లు ఉండగా.. పాయింట్ల శాతం 63.330గా ఉంది.
Also Read
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
Read Also: BCCI: బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా నియామకం..
టీమిండియా మూడో స్థానానికి చేరుకుంది:
2023-25 సైకిల్‌లో ఆస్ట్రేలియా 14 మ్యాచ్‌లలో 9 గెలిచింది.. 4 ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. కంగారూ జట్టు 102 పాయింట్లు ఉండగా.. పాయింట్ల శాతం 60.710గా ఉంది. అడిలైడ్‌లో ఓటమి తర్వాత భారత జట్టు మూడో స్థానానికి పడిపోయింది. ఈ సైకిల్‌లో టీమిండియా 16 మ్యాచ్‌లు ఆడి 9 విజయాలు సాధించింది. భారత్ 6 ఓడిపోగా.. ఒక మ్యాచ్ డ్రా అయింది. భారత జట్టుకు 110 పాయింట్లు ఉండగా.. పాయింట్ల శాతం 57.290 ఉంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాల్సి వస్తే.. ఎట్టిపరిస్థితుల్లోనూ టాప్-2లో నిలవాల్సిందే. అందుకోసం.. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతోంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో గెలుపొందగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్ ఆడాలంటే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 4-1 లేదా 3-1 తేడాతో గెలవాలి.
WTC ఫైనల్‌కు భారత్ వెళ్లాలంటే..?
టీమిండియా BGTని 3-2తో గెలిస్తే.. ఫైనల్ ఆడేందుకు శ్రీలంకపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇందుకోసం శ్రీలంక 1 లేదా 2 టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఓడించాల్సి ఉంటుంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ 2-2తో సమంగా ఉంటే శ్రీలంక 2-0తో ఆస్ట్రేలియాను ఓడించాల్సి ఉంటుంది.
ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 2-3 తేడాతో ఓడిపోతే ఫైనల్ ఆడాలంటే రెండు జట్లపైనే ఆధారపడాల్సి ఉంటుంది.
ఈ పరిస్థితిలో పాకిస్థాన్ 2-0తో దక్షిణాఫ్రికాను ఓడించాల్సి ఉంటుంది. అదేవిధంగా తొలి టెస్టులో శ్రీలంకను ఆస్ట్రేలియా ఓడించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!