Rishabh Pant Got Injured: బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా.. టీమిండియా మొదటి టెస్టులో విజయం సాధించగా.. ఆ తర్వాత రెండో టెస్ట్ అడిలైడ్ లో 10 వికెట్ల తేడాతో ఓటమిని చూసింది. ఇక టీమిండియా ప్రస్తుతం బ్రిస్బేన్ టెస్టుకు సన్నద్ధమవుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టుకు టీమిండియా ఆటగాళ్లంతా సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అయితే, ఈ క్రమంలో రిషబ్ పంత్ గాయపడ్డాడు. బ్రిస్బేన్‌లోని గబ్బాలో టెస్టుకు సిద్ధమవుతున్న సమయంలో పంత్ గాయపడ్డాడు. త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు నెట్స్‌లో రిషబ్ పంత్‌కి బౌలింగ్ చేస్తున్న సమయంలో రఘు సైడ్ ఆర్మ్ తో బౌలింగ్ చేస్తూ పంత్‌కు ప్రాక్టీస్‌లో సహాయం చేస్తున్నాడు. ఆ సమయంలో బంతి నేరుగా అతని హెల్మెట్‌కు తగిలింది. అప్పుడే, పంత్ గాయపడ్డాడు. రిషబ్ పంత్ గాయపడటంతో బ్యాటింగ్ ప్రాక్టీస్ నిలిపివేశాడు.
Also Read: Top 10 Google Searches: 2024 ఇండియాలో టాప్ -10 గూగుల్ సెర్చ్‌లు ఇవే..
దీని తర్వాత వైద్య సిబ్బందిలో రఘుతో పాటు, భారత ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ ఇంకా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ దోస్చాట్ పంత్ దెగ్గరికి వచ్చారు. ఆ సమయంలో అందరూ పంత్‌ను పరిశీలించారు. రిషబ్ పంత్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, అతనికి స్వల్ప గాయమైందని సమాచారం. అయితే దెబ్బ తగిన తర్వాత కొద్దీసేపు తర్వాత పంత్ మళ్లీ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బాలో ప్రారంభం కానుంది.
Also Read: Pushpa-2 Controversy: పుష్ప- 2కి షెకావత్ కష్టాలు.. దాడులు చేస్తామంటూ కర్ణిసేన వార్నింగ్
2021లో ఇదే మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా గెలిచింది. ఆ మ్యాచ్ లో రిషబ్ పంత్ టీమ్ ఇండియా కొత్త హీరోగా అవతరించాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో 328 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంత్ రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 89 పరుగులు చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. అయితే ప్రస్తుత సీజన్లో రిషబ్ తన బ్యాటింగ్ పవర్ ను చూపించేందుకు ఇబ్బందులు పడుతున్నాడు.