బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 132 పరుగులు లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించింది. భారత్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 79 రన్స్ చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్.. బిన్నంగా సంబరాలను చేసుకున్నాడు. బొటనవేలు, చూపుడు వేలును పైకి చూపిస్తూ అభివాదం చేశాడు. ఇలా ఎందుకు చేశాడో మ్యాచ్ అనంతరం వివరణ ఇచ్చాడు.
Also Read: Rohit Sharma: అందరి కళ్లు రోహిత్‌పైనే.. ఎలా ఆడతాడో మరి!
‘నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రయత్నించా. హాఫ్ సెంచరీ చేయం చాలా ఆనందంగా ఉంది. ఫిఫ్టీ చేశాక బిన్నంగా అభివాదం చేయడానికి కారణం ఉంది. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కోసమే అలా చేశా. వీరిద్దరు మాకు పూర్థి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. యువ క్రికెటర్లతో వారు మాట్లాడే విధానం బాగుంటుంది’ అని అభిషేక్ శర్మ చెప్పాడు. ‘ఈడెన్ పిచ్ బాగుంది. మా బౌలర్లు అద్భుతమైన బంతులేశారు. 160-170 పరుగుల టార్గెట్ ఉంటుందని మేం భావించా. అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు. సంజు శాంసన్ మరో ఎండ్‌లో ఉండటాన్ని నేను ఆస్వాదించా. ఐపీఎల్ మ్యాచులలో దూకుడుగా ఆడటం నాకు కలిసొచ్చింది. ఇంగ్లండ్ పేస్‌ను ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధమే. షార్ట్ పిచ్ బంతులతో వారు ఇబ్బంది పెడతారని తెలుసు. నా ఆట నేను ఆడాను’ అని అభిషేక్ తెలిపాడు.
The fifty celebration by Abhishek Sharma.#INDvsENG #BCCI pic.twitter.com/f2DJbRTjZK
— Cricket Tufani (@mohitso39392499) January 22, 2025