ఆసియాకప్ 2025 ఫైనల్స్ లో భారత్ -పాక్ హోరాహోరీగా తలపడ్డాయి. చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది. టైటిల్ పోరులో భారత్ పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించి విజయం సాధించింది. భారత్ విజయంలో తిలక్ వర్మ వీరోచిత పోరాటం మరువలేనిది. తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పాడు.. అతడి పేరు వింటేనే దాయాదికి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. ఓటమి తీరాలకు వెళ్తున్న మ్యాచ్‌కు ఒంటరిపోరాటంతో గెలుపుబాటలు వేశాడు.
Also Read:Pawan Kalyan : ‘కాంతారా ఛాప్టర్ -1’ టికెట్ ధరలు పెంపు.. ఆటంకాలు కల్పించవద్దు!
ప్రపంచమంతా ఈ పేరే మార్మోగుతోంది. హైఓల్టేజ్ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన తిలక్‌వర్మ.. ఆసియా కప్ భారత్ వశం అయ్యేలా చేశాడు. తిలక్ వర్మ.. మా హైదరాబాదీ అని కాలర్ ఎగరేసి చెప్పుకుంటున్నారు క్రికెట్ లవర్స్. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఆసియా కప్ ఫైనల్లో తిలక్ కలకాలం గుర్తిండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో చెలరేగి 69 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు.
Also Read:Theft: పి.ఎం.జే. జ్యువలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగుల చేతివాటం.. రూ 16 కోట్ల ఆభరణాలు కాజేత
తిలక్ వర్మ స్వదేశానికి చేరుకున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో తిలక్ వర్మ ల్యాండ్ అయ్యాడు. తిలక్ ను రిసీవ్ చేసుకునేందుకు ప్రభుత్వ అధికారులు, sats చైర్మన్ శివసేన రెడ్డి వచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ ఎన్టీవీతో మాట్లాడారు. “ఆపరేషన్ తిలక్ వర్మ”.. అని దేశమంతా అంటుండటం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సంతోషాన్ని ఎలా పంచుకోవాలో కూడా తెలియడం లేదని తెలిపారు. తిలక్ వర్మ రేపు సీఎం రేవంత్ ను కలవనున్నట్లు సమాచారం.