King Charles: లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత టీమిండియా పురుషులు, మహిళా క్రికెట్ జట్లు బ్రిటన్ రాజు చార్లెస్ ను లండన్ లోని క్లారెన్స్ హౌస్ లో మంగళవారం (జూలై 15) కలిశాయి. ఈ సందర్బంగా.. రాజు చార్లెస్ భారత జట్లతో మమేకమై, లార్డ్స్ లో జరిగిన ఇంగ్లాండ్, భారత్ మూడో టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన హైలైట్లను తాను చూశానని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఐదో…
Anil Kumble: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు టీమిండియా తరపున ఆడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి హీరో అనడంలో ఎలాంటి సందేహమే లేదని భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసించారు.
ఓ క్రీడా జర్నలిస్ట్ ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌లో యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ భారత వన్డే జట్టుకు వచ్చే సిరీస్ నుంచే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని అందులో రాసుకొచ్చాడు. ఇప్పటికే టెస్ట్‌లలో టీమిండియా నాయకత్వ బాధ్యతలు చేపట్టిన గిల్.. ఇప్పుడు వన్డే కెప్టెన్సీకి కూడా అందుకోనున్నాడా? అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
Pat Cummins Reaction : ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మొదటి టెస్టులో ఓడి, ఎడ్జ్ బస్టన్లో జరిగిన 2వ టెస్టులో చరిత్రాత్మకమైన విజయాన్ని అందుకుంది. అయితే ఈ రెండు టెస్టుల్లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. మరి ముఖ్యంగా కొత్త కెప్టెన్ శుభమన్ గిల్ అయితే వేరే రేంజులో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే రెండు టెస్టుల్లో కలిపి 3 సెంచరీలు బాదేశాడు. మొత్తంగా 500 పైగా పరుగులు చేసాడు. ఇక మొదటి టెస్టులో మనవాళ్ళు ఏకంగా…
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై చారిత్రక విజయానికి అందుకున్న భారత జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా మాజీలే కాదు.. ఇంగ్లండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ల నుంచి కూడా అభినందనలు రావడం గమనార్హం. రెండో టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియాను ఇంగ్లీష్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ ప్రశంసించారు. ఇంగ్లండ్ బజ్‌బాల్ క్రికెట్‌కు మిగతా టీమ్స్ జంకుతాయేమో కానీ.. భారత్ మాత్రం భయపడదు అని పేర్కొన్నారు. శుభ్‌మన్ గిల్ అటు కెప్టెన్, ఇటు బ్యాటర్‌గానూ జట్టును ముందుండి నడిపించాడని వ్యాఖ్యానించారు.…
వచ్చే ఆగస్టులో జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), బీసీసీఐ సంయక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త షెడ్యూల్‌ను తరువాత విడుదల చేస్తామని బీసీసీఐ పేర్కొంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 2026లో నిర్వహించేందుకు బీసీబీ సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక హింసాత్మక…
బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌లో భారీ శతకం బాదాడు. 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సులతో 143 రన్స్ చేశాడు. 52 బంతుల్లోనే సెంచరీ చేసి.. అండర్-19 వన్డేల్లో అత్యంత వేగంగా, చిన్న వయసులో శతకం కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులో వైభవ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. సెంచరీలతో సత్తాచాటుతున్న వైభవ్..…
Harry Brook Sledge Shubman Gill: ఐదు టెస్ట్‌ల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్షాన్ని ఉంచిన గిల్ సేన.. ఇప్పటికే మూడు వికెట్లు తీసి విజయం దిశగా దూసుకెళుతోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 72/3 స్కోరుతో ఉండగా.. చివరి రోజైన ఆదివారం భారత్ 7 వికెట్స్ తీస్తే మ్యాచ్ సొంతమవుతుంది. ప్రస్తుతం మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే…
టెస్ట్ క్రికెట్లో భారత పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలిసారి 1000 పరుగుల మార్కును అందుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఈ అరుదైన రికార్డు సాధించింది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో 1,000 పరుగులు దాటిన ఆరో జట్టుగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 427/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో మొత్తంగా భారత్ 1014 పరుగులు చేసింది. గతంలో టీమిండియా…
క్రికెట్లో టీమిండియా ఎక్కడ ఆడినా ఆదరణ లభిస్తుంది. మరి ముఖ్యంగా ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో అయితే ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. దానికి కారణం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అవును ఆసియాకప్ లో ఇరుజట్లు 2 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరింత రసవత్తరంగా సాగుతుంది.పైగా ఆసియాలోనే ఇవి రెండు బలమైన జట్లు. అందుకే రెండు లేదా 3 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది. నిజంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ కిక్కే…