IND Vs AUS: ఆసియా కప్ వైఫల్యాన్ని భారత్ కొనసాగించింది. మొహాలీలో టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా చెలరేగి ఆడింది. మరోసారి టీమిండియా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించింది. కామెరూన్ గ్రీన్ 30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి బలమైన పునాది వేశారు. చివర్లో మాథ్యూ వేడ్ 21 బంతుల్లో 45 పరుగులు చేయడంతో 209 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా…
IND Vs AUS: మొహాలీలో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ రోహిత్ 11 పరుగులకే అవుట్ కాగా విరాట్ కోహ్లీ 2 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడి ఆసీస్ బౌలర్లకు కళ్లెం వేశాడు.…
మొహాలీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆశ్చర్యకరంగా బుమ్రాను తుది జట్టులోకి తీసుకోకుండా ఉమేష్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. అటు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ బదులు దినేష్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకుంది. ఆల్‌రౌండర్ కోటాలో దీపక్ హుడా బదులు అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించింది. రోహిత్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు రానున్నారు. కాగా రానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్…
Team India: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవల ఆసియాకప్‌లో సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో మంగళవారం నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌లో అందరి కళ్లు కోహ్లీ బ్యాటింగ్‌పైనే ఉన్నాయి. అయితే తాజాగా నెట్స్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మీడియం పేస్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడంతో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కోహ్లీ బౌలింగ్ కూడా చేస్తాడా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఆసియా కప్‌లో బౌలింగ్ వైఫల్యంతోనే టీమిండియా టోర్నీ…
T20 World Cup: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో బ్యాట్ పట్టబోతున్నాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్ అవతారం ఎత్తనున్నాడు. రోహిత్ శర్మతో పాటు రాహుల్ గాంధీ ఓపెనర్‌గా రాబోతున్నాడు. ఇదంతా నిజమా అని మీరు అనుకోకండి. రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో ఇండియన్ టీమ్‌లోని బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఓ టీవీ యాంకర్ న్యూస్ చదువుతూ తడబడ్డాడు. ఇండియన్ టీమ్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు రాహుల్ గాంధీ బరిలోకి దిగనున్నట్లు…
Yuvraj Singh: సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ సంచలనం సృష్టించాడు. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై ఆకాశమే హద్దుగా యువరాజ్ చెలరేగిపోయాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. పురుషులు టీ20 మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా యువీ రికార్డులకెక్కాడు. అతడి వీర బాదుడుకు బ్రాడ్ బిక్కమొహం వేశాడు. అంతకుముందు ఓవర్లో ఫ్లింటాఫ్‌తో గొడవ కారణంగా…
Ravi Shastri: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరెన్ని వాదనలు చేసినా అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా నంబర్‌వన్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యానేనని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది వారి ఇష్టమని.. తన అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉందని తెలిపాడు. ప్రతి ఒక్కరికి తమదైన అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంటుందన్నాడు. టీ20 ఫార్మాట్లో పాండ్యాకు తిరుగు లేదని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇటీవల ఆసియా కప్‌లో…
Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫిట్నెస్తో పాటు ట్రెండ్‌ను కూడా ఫాలో అవుతుంటాడు. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం విరాట్ కోహ్లీ మొహాలీ చేరుకున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈ నెల 20న మొహాలీలోని పీసీఏ స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా మొహాలీ ఎయిర్‌పోర్టులో విరాట్ కోహ్లీ దిగిన ఫొటోలను పీసీఏ తన ట్విటర్లో పంచుకుంది. ఈ ఫోటోల్లో కొత్త హెయిర్ స్టైల్లో కనిపించాడు. అతడి కొత్త…
BCCI: వచ్చేనెలలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా జట్టును సెలక్టర్లు ప్రకటించారు. అయితే ప్రధాన బౌలర్ షమీని స్టాండ్ బైగా ప్రకటించడం విమర్శలకు తావిచ్చింది. షమీని ఎందుకు తుది జట్టులోకి తీసుకోలేదని విమర్శకులు బీసీసీఐపై దుమ్మెత్తిపోశారు. తాజాగా షమీని తుది జట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణాలను బీసీసీఐ సెలక్టర్ వెల్లడించారు. మహమ్మద్ షమీ స్టాండ్‌బైగా ఉన్నా దాదాపు తుది జట్టులో ఉన్నట్లేనని ఆయన స్పష్టం చేశారు. గాయాలతో…
Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కొత్త జోష్‌లో కనిపిస్తున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల ఆసియా కప్‌లో సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ ఉత్తేజంగా ముందుకు సాగిపోతున్నాడు. మరోవైపు ట్విట్టర్లో 50 మిలియన్ ఫాలోవర్ల మైలురాయిని అందుకున్నాడు. ట్విట్టర్ వేదికగా పలు యాడ్లను షేర్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నాడు. తాజాగా ఫుమా కంపెనీకి చెందిన ఓ వీడియోను కోహ్లీ షేర్ చేశాడు. ఈ వీడియోలో ఫుమా కంపెనీ గురించి కాకుండా తన…