IND Vs SA 1st T20: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగిసింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ మొదలైంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ కోసం భారత జట్టు పలు మార్పులు చేసింది. ఈ సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వగా.. ఆశ్చర్యకరంగా తొలి మ్యాచ్‌కు బుమ్రాను కూడా దూరం పెట్టారు. అతడి స్థానంలో అర్ష్ దీప్ సింగ్‌కు…
IND Vs SA: కేరళ రాజధాని తిరువనంతపురంలో బుధవారం నాడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం అటు విరాట్ కోహ్లీ అభిమానులు, ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు పోటాపోటీగా కటౌట్లు ఏర్పాటు చేయడం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. గ్రీన్ ఫీల్డ్ మైదానానికి వెళ్లే దారిలో తొలుత విరాట్ కోహ్లీ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే రోహిత్ కటౌట్‌ను కూడా ఏర్పాటు చేశారు.…
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించాడు. ద్రవిడ్ 504 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 24,064 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 471 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 24,078 పరుగులు సాధించాడు. టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రమే విరాట్ కోహ్లీ కన్నా ముందు నిలిచాడు. సచిన్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు…
IND Vs SA: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ గెలుచుకున్న టీమిండియా జోరు మీద కనిపిస్తోంది. బుధవారం నుంచి సొంతగడ్డపై మరో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ మేరకు దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు సెలక్టర్లు ముందుగానే హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్‌కు విశ్రాంతి కల్పించారు. అటు కరోనా కారణంగా ఆసీస్‌తో సిరీస్‌కు దూరమైన షమీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆల్‌రౌండర్ దీపక్ హుడా కూడా…
IND Vs AUS 3rd T20: హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఒకే ఏడాది టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఈ ఏడాది భారత్ 21 టీ20ల్లో గెలిచింది. ఈ మ్యాచ్‌లో 187 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. ఓపెనర్లు రాహుల్ (1), రోహిత్ (17) ఇద్దరూ నిరాశపరిచినా విరాట్ కోహ్లీ (63), సూర్యకుమార్ యాదవ్ (69)…
IND Vs AUS 3rd T20: హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ముందు భారీ స్కోరు నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలి 5 ఓవర్లు, చివరి 5 ఓవర్లలో చెలరేగి ఆడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది. ఓపెనర్ కామెరూన్ గ్రీన్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అతడు మొత్తం 52…
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్‌ను డిసైడ్ చేసే నిర్ణయాత్మక మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రిషబ్ పంత్ స్థానంలో భువనేశ్వర్‌ను తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరొకటి గెలవగా.. నేటి మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం…
MS Dhoni: టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియాలో లైవ్‌లోకి వస్తానని.. గుడ్ న్యూస్ చెప్తానని శనివారం ప్రకటించాడు. దీంతో ధోనీ చెప్పే గుడ్ న్యూస్‌పై చాలా మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే ధోనీ లైవ్‌లోకి వచ్చి చెప్పిన విషయం తెలిస్తే మీరు షాకవుతారు. ఇంతకీ ధోనీ ప్రకటించిన విషయం ఏంటంటే.. ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ ఓరియోను లాంచ్ చేశాడు. అయితే ఇది కమర్షియల్ ప్రకటన…
Jhulan Goswami: టీమిండియా మహిళా జట్టు దిగ్గజ పేసర్ జూలన్ గోస్వామి తన కెరీర్లో చిట్టచివరి మ్యాచ్ ఆడేసింది. ఈరోజు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే ఆమెకు చివరి మ్యాచ్. అయితే ఆఖరి మ్యాచ్‌లో జూలన్ గోస్వామి బ్యాటింగ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరగడం అభిమానులను నిరాశపరిచింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జూలన్ గోస్వామిని భారత జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రత్యేకంగా గౌరవించింది. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్‌కౌర్ కన్నీటిపర్యంతమైంది. అటు…
Mahendra Singh Dhoni: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ నెల 25న సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియా లైవ్‌లోకి వచ్చి సర్ప్రైజ్ను ధోనీ రివీల్ చేయనున్నాడు. సాధారణంగా ధోనీ సోషల్ మీడియాలో అంతంత మాత్రంగానే యాక్టివ్‌గా ఉంటాడు. చాలా అరుదుగా పోస్టులు చేస్తుంటాడు. అయితే ఫేస్బుక్లో మాత్రం అప్పుడప్పుడు పోస్టులు పెట్టి అభిమానులను ఉత్సాహపరుస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఈనెల 25న లైవ్‌లో ఓ…