Axar Patel: చరిత్ర సృష్టించిన అక్షర్ పటేల్.. టీమిండియా తొలి ఆటగాడిగా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Axar Patel: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో అతడు 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తన తొలి అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. దీంతో భారత్ తరఫున ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా అక్షర్ పటేల్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏడో స్థానంలో బరిలోకి దిగి 65 పరుగులు ఎవరూ చేయలేదు. గతంలో ఈ రికార్డు జడేజా పేరిట ఉండేది. అతను కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 23 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇప్పుడు అక్షర్ పటేల్ జడేజాను అధిగమించి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Read Also: Mirchi Price: పసిడిని దాటిన మిర్చి రేట్.. ఎనుమాముల మార్కెట్‌లో మిర్చికి రికార్డు ధర
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్‌లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
- WTC Final: భారత్‌కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- India vs Sri Lanka Test: మానవ్ సుతార్ సంచలనం.. అశ్విన్, హర్భజన్ రికార్డులు బద్దలు..!
- Babar Azam: ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
మరోవైపు ఈ మ్యాచ్‌లో జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండగా ఏడో స్థానంలో బరిలో దిగిన అక్షర్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తం ఆరు భారీ సిక్సర్లు, మూడు ఫోర్ల సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ తరఫున ఇది ఐదో వేగవంతమైన హాఫ్ సెంచరీ. అదే సమయంలో ఆరు అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆటగాళ్లలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం గమనించాల్సిన విషయం. అంతేకాకుండా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్‌గానూ అక్షర్ పటేల్ రికార్డు సృష్టించాడు.
తాజావార్తలు
-
Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్‌తో హోండా CB300F ట్విస్టర్ 2027.. 24.7 CV పవర్, 26.2 Nm టార్క్
-
E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి భోగభాగ్యాలు, పండగే ఇవాళ!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Realme 17 Pro+: రియల్మీ 17 ప్రో+.. 200MP కెమెరా, 1.5K OLED డిస్ప్లేతో అదుర్స్! లీకైన స్పెసిఫికేషన్స్ ఇవే
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!