సర్కారీ బడుల రూపరేఖల్ని మార్చేస్తున్న జగన్ సర్కార్… విద్యార్థులకు మెరుగైన విద్య అందేందుకు చర్యలు చేపడుతోంది. టీచర్లు రోజూ స్కూల్‌కు రావడమే కాదు… సమయపాలన పాటించేలా చేస్తోంది. దీనికోసం నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ను ఉపయోగించబోతోంది. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తోంది ఏపీ సర్కార్. ఇప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కూడా నడుం కట్టింది. టీచర్లకు ప్రత్యేకంగా తయారు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ను ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్ వైఎస్…
Botsa Satyanarayana: ఫేస్ రికగ్నిషన్ యాప్ విషయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు విఫలం అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్స్ విషయంలో ఉపాధ్యాయులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందని.. నిమిషం ఆలస్యం అయితే ఆబ్సెంట్ వేస్తారన్నది వాస్తవం కాదన్నారు. మూడు సార్లు ఆలస్యంగా వస్తే నాలుగోసారి హాఫ్ డే కింద పరిగణించటం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా టీచర్ల అటెండెన్స్ కోసం ఫేస్ రికగ్నిషన్ యాప్ ఇప్పుడు గందరగోళం సృష్టిస్తోంది.. హాట్ టాపిక్‌గా మారిన ఈ యాప్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. టీచర్లు స్కూళ్లకు రాగానే ముందుగా చేయాల్సిన పని ఫొటో దిగడం.. పాఠశాలల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం.. అయితే, ఆ యాప్‌లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టీచర్లకు కోపం తెప్పిస్తోంది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న బయోమెట్రిక్,…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఫేస్ క్యాప్చరింగ్ అటెండెన్స్ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.. చాలా చోట్ల ఈ విధానం అమల్లోకి రాకపోవడంతో ఉపాధ్యాయులు తంటాలు పడుతున్నారు. యాప్ డౌన్‌లోడ్‌కు తోడు.. ఫొటో అప్‌లోడ్ చేయడానికి ఉపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.. ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు టీచర్లు.. ఇక, ఈ విధానం.. ఉపాధ్యాయులపై కక్షసాధింపుగా ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.. సీఎం జగన్ కక్షసాధింపు చర్యలతో ఉపాధ్యాయులు బేజారెత్తుతున్నారు.. పీఎఫ్ నిధులు ఇంకా…
ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని విద్యా శాఖ కార్యదర్శిని ఆదేశించారు మంత్రి సబిత
నిరుద్యోగులకు శుభవార్త అందించారు ఏపీ సీఎం జగన్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 1998 DSC అభ్యర్దులకు ఊరట నిచ్చే అంశంపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు జగన్. వారికి న్యాయం చేసే ఫైల్ పై సంతకం చేశారు సీఎం వైఎస్ జగన్. దీంతో వారికి ఉద్యోగం ఇచ్చేందుకు విధివిధానాలను సిద్దం చేస్తున్నారు అధికారులు. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న 1998 DSC ఫైల్ పై సీఎం సంతకం చేశారని తెలిపారు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి.…