ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఫేస్ క్యాప్చరింగ్ అటెండెన్స్ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.. చాలా చోట్ల ఈ విధానం అమల్లోకి రాకపోవడంతో ఉపాధ్యాయులు తంటాలు పడుతున్నారు. యాప్ డౌన్‌లోడ్‌కు తోడు.. ఫొటో అప్‌లోడ్ చేయడానికి ఉపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.. ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు టీచర్లు.. ఇక, ఈ విధానం.. ఉపాధ్యాయులపై కక్షసాధింపుగా ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.. సీఎం జగన్ కక్షసాధింపు చర్యలతో ఉపాధ్యాయులు బేజారెత్తుతున్నారు.. పీఎఫ్ నిధులు ఇంకా జమకు నోచుకోలేదని విమర్శిస్తున్నారు.. మొత్తంగా.. టీచర్స్ అటెండెన్స్ యాప్ తో మొదటి రోజే తిప్పలు తప్పడంలేదు.. నెట్ లేక కొంతమంది, స్మార్ట్స్ ఫోన్స్ లేక ఇంకొంత మంది ఈ యాప్ తో చుక్కలు చూస్తున్నారు.. డౌన్‌లోడ్ ప్రాబ్లమ్, నెట్ వర్క్ ప్రాబ్లెమ్ తో ఏం చేయాలో తెలియక టీచర్స్ తలాలు పట్టుకుంటున్నారు… గతంలో ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని పక్కన పడేసి.. ప్రభుత్వం కొత్తగా తీసుకుని వచ్చిన ఈ యాప్ పై మండిపడుతున్నారు.
Read Also: Bill Gates: ప్రధాని మోడీపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ఫేస్ క్యాప్చరింగ్ అంటెడెన్స్‌పై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వస్తున్న ఈ ఆన్‌లైన్ హాజరు ఉపాధ్యాయ లోకాన్ని కలవరపెడుతుంది. ఆశయం మంచిది, కానీ, ఆవేశం.. ఆలోచనను ఇవ్వదు. ఒక ముడి విప్పబోయి మరో ముప్ఫై మూడు ముడులు వేసుకుంటే ఇక ఎప్పటికీ ఒక ముడిని కూడా విప్పలేము. అలాగే సమస్య ఎక్కడ ఉందో గుర్తించి దానిని పరిష్కరించాలి.. కానీ, మొత్తం గందరగోళంగా చేసుకోకూడదు అంటున్నారు.. అయితే, రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన తొలిరేజో ఈ ఫేస్ క్యాప్చరింగ్ అటెండెన్స్ ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతోంది.. అయితే, అటెండెన్స్ యాప్ పద్ధతి వెంటనే ఉపసంహరించుకోవాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.. మేం విద్యార్ధులకు పాఠాలే చెప్పాలా… యాప్ లతో కుస్తీ పట్టాలా…? అని ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రభుత్వ శాఖలోని లేని పద్ధతి మా ఉపాధ్యాయులపై రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వం విద్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు.. యాప్ అటెండెన్స్ విధానం వల్ల చాలా నష్టం అంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.. ప్రభుత్వం దిగిరాకుంటే మా విధులను బాయ్ కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.