Teachers Face Recognition App: ఫేస్ యాప్ అటెండెన్స్‌పై గందరగోళం.. రంగంలోకి మంత్రి బొత్స..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా టీచర్ల అటెండెన్స్ కోసం ఫేస్ రికగ్నిషన్ యాప్ ఇప్పుడు గందరగోళం సృష్టిస్తోంది.. హాట్ టాపిక్‌గా మారిన ఈ యాప్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. టీచర్లు స్కూళ్లకు రాగానే ముందుగా చేయాల్సిన పని ఫొటో దిగడం.. పాఠశాలల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం.. అయితే, ఆ యాప్‌లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టీచర్లకు కోపం తెప్పిస్తోంది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న బయోమెట్రిక్, ఐరిస్ స్థానంలో ఫేస్ యాప్ విధానాన్ని ప్రవేశ పెట్టడం.. టీచర్లు ఒక్క నిమిషం ఆలస్యంగా విధులకు హాజరైనా హాఫ్ డే లీవ్ గా పరిగణించేలా రూపొందించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.. అయితే, ఈ వ్యవహారంలో రంగంలోని దిగారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఉపాధ్యాయ సంఘాలతో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్నొరు.. ఫేస్ యాప్ ద్వారా అటెండెన్స్ విషయంలో నెలకొన్న గందరగోళం, యాప్ వద్దంటూ ఉపాధ్యాయ సంఘాల చేస్తున్న ఆందోళనపై చర్చించనున్నారు.. మూడు గంటలకు మంత్రి బొత్స, విద్యాశాఖ అధికారులతో సమావేశం కానున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.
Read Also: Munugodu TRS : మునుగోడులో చేరికలు ఊపందుకున్నాయా..?
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
మరోవైపు, మూడో రోజు ఉపాధ్యాయ సంఘాలో ఆందోళనకు కొనసాగిస్తున్నాయి.. అటెండెన్స్ యాప్ ను పూర్తిగా తొలగించాలంటున్నాయి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులపై యాప్ ల భారం అధికమైందని..మంత్రి బొత్స తో చర్చలు విఫలం అయితే ఉద్యమం మరింతా ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరగబడుతున్నరు కాబట్టే మాపై ఈ కక్ష్య పూరిత ఆలోచన అని ఆరోపిస్తున్నారు. అటెండెన్స్ యాప్ నిర్ణయం పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫేస్ యాప్ పై విద్యశాఖ అధికారులు, మంత్రి బొత్స తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది యూటీఎఫ్.. సొంత ఫోన్‌లో ఉపాధ్యాయులు హాజరు వేయరు.. హాజరు వేయడానికి కొత్త డివైజ్ లు ఇవ్వాలని.. 9 దాటితే సెలవంటూ షోకాజ్ నోటీసులు ఇస్తాం అంటూ బెదిరిస్తున్నారు… ఇప్పటికే 14కు పైగా యాప్స్ ఉన్నాయి… యాప్స్ కాకుండా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ పెంచాలని.. యాప్స్ పేరుతో ఉపాధ్యాయులను వేధించటం సరైంది కాదంటున్నారు యూటీఎఫ్ నేతలు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!