సర్కారు బడుల్లో జియో అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ.. తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సర్కారు ఆదేశాలతో జియో అటెండెన్స్ అమలు చేస్తున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో 1156 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 5వేలకు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. చాలా స్కూళ్లలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని .. ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విద్యాశాఖ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరి చేసింది. సర్కారు నిర్ణయంతో ఉపాధ్యాయుల్లో కొత్త టెన్షన్‌కు మొదలైంది. ఇటీవల డిచ్‌పల్లిలో ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లు డుమ్మా కొట్టారు. గ్రామస్థులు పాఠశాలకు తాళం వేసిన ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఇకపై సమయానికి పాఠశాలలకు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. సర్కారు నిర్ణయాన్ని చాలా మంది ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నా.. బయటకు మాత్రం మంచి నిర్ణయం స్వాగతిస్తున్నామంటున్నారు.
Read Also: Monkey Drinking beer: వైన్స్‌లో దూరి మద్యం ఎత్తుకెళ్తున్న కోతి..! బీరు భలేగా లాగిస్తుందిగా
సర్కారు బడుల్లో పనిచేసే ఉపాధ్యాయులు.. నిర్ణీత సమయానికి స్కూల్ కు హాజరయ్యే విధంగా అమలు చేస్తున్న జియో అటెండెన్స్‌కు.. సాంకేతిక సమస్యలు గుదిబండగా మారాయి. చాలా మందికి సర్వర్ సమస్య ఉత్పన్నం అవుతోంది. ఫలితంగా స్కూల్ కు నిర్ణీత సమయానికి వచ్చినా.. హాజరు వేసుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకుండా డుమ్మాలు కొట్టడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. జియో అటెండెన్స్‌పై ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు… ఐతే హాజరుశాతం అంతంతమాత్రంగానే ఉంటుంది. జిల్లాలో 5,700లకు పైగా ఉపాధ్యాయులు ఉండగా.. జియో అటెండెన్స్‌లో 50 శాతం మంది మాత్రమే హాజరు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్ ప్రాబ్లం రావడంతో చాలామంది ఉపాధ్యాయులు ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాల ప్రారంభమైన మొదటి పిరియడ్‌లోనే ఉపాధ్యాయులు తమ హాజరును నమోదు చేసుకోవాలి. సెల్ఫీ ఫొటోతో అటెండెన్స్ నమోదవుతుంది.. కాబట్టి పాఠశాల ప్రాంగణంలోనే ఉపాధ్యాయులు తమ జియో అటెండెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అయితే,. కొందరికి మోదం మరికొందరికి ఖేధంగా ఉన్న ఈ విధానం ఏమేరకు సక్సెస్ అవుతుందో వేచిచూడాలి.