ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానంలో మార్పు చేర్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఓపీఎస్ విధానంలోనూ కొంత మేర తగ్గడానికి ఉద్యోగులు అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 95 శాతం హామీలను నెరవేర్చింది. నెరవేర్చని 5 శాతం హామీలలో సీపీఎస్ రద్దు అంశం ఒకటి. సీపీఎస్ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతిపాదనల పైనా చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం అని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1వ తేదీన సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్చలు నిర్వహించ లేదు.
పాత పెన్షన్ విధానం రాష్ట్రాలకు ఆర్థిక భారంగా మారుతుందని కేంద్రం సీపీఎస్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలతో పాటు 5 కోట్ల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. గురువులను గౌరవించు కోవడానికే ప్రభుత్వం ఎడ్యు ఫెస్ట్ 2022 నిర్వహిస్తోంది. ఎడ్యు ఫెస్ట్ నిర్వహణ సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనలను అడ్డుకోడానికి కాదు. వనరుల సమీకరణ, సిబ్బంది ఉద్యోగుల పునర్వ్యస్థీకరణ అంశాలపై ఈ నెల 29 తేదీన సీ ఎస్ సమీర్ శర్మ సమావేశం నిర్వహించనున్నారు.
Read Also: Bandi Sanjay : గుంట నక్కలు ఏకమయ్యారు.. బీజేపీ సింహం… సింగిల్‌గా వస్తుంది
సచివాలయం మొదటి బ్లాకులో అన్ని శాఖల ముఖ్య, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, హెచ్ఓడీలతో సమావేశం జరగనుంది. అటవీ శాఖ ద్వారా ఎర్ర చందనం వేలం, జీఎస్టీ వసూళ్లు, కోర్టు వివాదాల ద్వారా నిలిచిపోయిన రెవెన్యూ , ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల, స్టాంపుల ఆదాయం, 2724 గనుల లీజు నుంచి ఆదాయం తదితరాలపై చర్చ జరుగుతుంది. ప్రణాళిక, రహదారులు భవనాలు, పట్టణాల్లో ప్రజారోగ్యం, పంచాయితీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, జలవనరుల శాఖల పునర్వవస్థీకరణపై చర్చిస్తారు. పరిశ్రమలు- వాణిజ్య శాఖలోని వివిధ కార్పొరేషన్లు, వైద్యారోగ్య శాఖలోని ఆయుష్, ఔషధ నియంత్రణ తదితర విభాగాల పునర్వ్యవస్థీకరణ పై చర్చ జరుగుతుంది. సంబంధిత హెచ్ఓడిలు ఉన్నతాధికారులు ఈ అంశాలపై ప్రతిపాదనలతో రావాలని సూచనలు జారీ అయ్యాయి.
Read Also:KV Anudeep: వెంకటేశ్‌తో సినిమా.. అదొక్కటే ఆలస్యమంటోన్న డైరెక్టర్