డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఇకపై ప్రతి ఏటా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం అన్నారు.. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తాం అన్నారు.. ఉపాధ్యాయులపై అనవసరమైన ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు లోకేష్... ఇప్పటికే 16,347 పోస్టులతో డీఎస్సీ నిర్వహించామన్నారు లోకేష్... అనవసర శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయుల సమయం వృథా చేయొద్దని అధికారులకు సూచించారు మంత్రి లోకేష్.. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు.. విద్యా శాఖ…
వర్షం దాటికి రెండు వేర్వేరు గ్రామాలలోని పాఠశాలల్లో ఆ భవనాలకు సంబంధించి పెచ్చులు ఓవైపు, వర్షపునీరు మరోవైపు.. కిందపడుతోంది.. పెచ్చులు ఊడుతుండడంతో ఆ భవనం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి.. భయంతో స్కూల్‌కు రావాలంటేనే విద్యార్థులు వణికిపోతుంటూ.. ఒక గ్రామానికి చెందిన పాఠశాల పిల్లలను పీర్ల కొట్టానికి (ముస్లింలు పీర్లను పెట్టే ప్రదేశం) సంబంధించిన రేకుల షెడ్డులో పాటలు చెబుతుంటే.. మరో గ్రామంలో గణేష్ మండపంలో పాటలు చెబుతున్నాడు ఉపాధ్యాయులు.
జోధ్‌పూర్‌లోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) శ్రీగంగానగర్‌లో రహస్యంగా మాదకద్రవ్యాలను తయారు చేస్తున్న ప్రయోగశాల గుట్టురట్టు చేశారు. అక్కడ ప్రాణాంతకమైన మాదకద్రవ్య పదార్థం మెఫెడ్రోన్ (4-మిథైల్మెత్కాథినోన్) అక్రమంగా తయారు చేస్తున్నారు. సైన్స్ టీచర్లే డ్రగ్స్ తయారు చేయడం చర్చనీయాంశంగా మారింది. స్కూల్ కు సెలవులు పెట్టి మరీ డ్రగ్స్ తయారీలో మునిగిపోయారు. Also Read:Samsung Galaxy Z Fold 7: Galaxy Z Fold 7 విడుదల.. 200MP కెమెరా, ఏఐ ఫీచర్లతో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్…
సీఎంలు అనుకూలంగా మాట్లాడే టీచర్లు ఎమ్మెల్సీలు అయ్యారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.. తెలంగాణలో పాత పీఆర్సీ దిక్కులేదని చెప్పారు. ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యాక రెండు మూడు ఏళ్లు గడిచిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందన్నారు. దానికి కేసీఆర్, రేవంత్ రెడ్డి కారణమని స్పష్టం చేశారు.
పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు.
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థుల కల నేటితో నెరవేరనుంది. తెలంగాణ 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇవాళ నియామక పత్రాలు అందజేయనున్నారు. మొత్తం 10,006 మంది నియామక పత్రాలను అందుకోనున్నారు.
విద్యార్థులకు దిశానిర్ధేశం చేయాల్సిన ఉపాధ్యాయుడు వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తించాడు. విద్యా బుద్ధులు నేర్పించి, సమాజంలో మంచి పౌరుడిగా తీర్చి దిద్దాల్సిన టీచర్.. కీచకుడిగా వ్యవహరించాడు. తిరుపతి జిల్లాలో కీచక ఉపాధ్యాయుడి బాగోతం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న అమ్మాయిలపై అసభ్య ప్రవర్తించిన ఈ ఘటన రేణిగుంట మండలం ఆర్ మల్లవరం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు రవిపై విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు.
రైల్వే జోన్ విషయంలో గత ప్రభుత్వం అనుకూలమైన ప్రదేశం ఇవ్వలేదు.. ఆ స్థలం మార్చాలని కోరినా గత ప్రభుత్వం స్పందించలేదు.. ఇప్పుడు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.. ఆమోదం రాగానే రైల్వే జోన్ పనులు జరుగుతాయని తెలిపారు బీజేపీ ఎంపీ.. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో వాగు దాటుతుండగా ఇద్దరు టీచర్లు ప్రమాదవశాత్తు చనిపోయారు. అయితే ఈ విషయంలో స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు.