ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టింగ్ లలో స్థానికతను పరిగణనలోకి తీసుకోకపోవడం గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులను మనో వేదనకు గురి చేస్తున్నాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలలో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో కోరారు. ఇంకా ఆయన ఈ లేఖలో రాష్ట్రంలో కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, బదిలీల కోసం ప్రభుత్వం డిసెంబర్ 6న జీవో నెంబర్ 317ను జారీ చేసింది.…
గురువు అంటే.. విద్యను నేర్పించేవాడు మాత్రమే కాదు.. ఒక తరాన్ని ఎలా నడిపించాలో నేర్పించేవాడు.. విలువలను నేర్పి సమాజాన్ని అభివృద్ధి చేసేవాడు.. అన్నింటికీ మించి ఆచరించి చెప్పే వాడే ఆచార్యుడు.. కానీ ఇప్పుడున్న గురువులు ఇలా ఉంటున్నారా..? అంటే నిస్సందేహంగా నో అనే చెప్తారు ఎవరైనా.. ప్రస్తుతం సమాజంలో జరిగే కొన్ని ఘటనలు చూస్తుంటే వారిని గురువులు అనాలా..? కామ పిశాచులు అనాలో అర్ధం కావడం లేదు.. కామంతో కళ్ళు మూసుకుపోయిన గురువులు.. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినిలపై…
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు టీచర్లు షాకిచ్చారు. టీచర్లను సన్మానించే కార్యక్రమానికి హాజరైన ఆయనకు అనూహ్యరీతితో టీచర్లు షాకిచ్చారు. కొత్త పోస్టింగ్‌లు, బదిలీల విషయంలో తాము స్థానిక ఎమ్మెల్యేలతో పైరవీలు చేయించుకొని ముడుపులు ఇచ్చామని సభలోని కొంతమంది టీచర్లు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు విన్న సీఎం అశోక్ గెహ్లాట్ షాకయ్యారు. వెంటనే ఈ ఆరోపణలు నిజమేనా అని తిరిగి సీఎం అందిముందు ప్రశ్నించారు. Read: ఆఫ్ఘన్‌లో మళ్లీ బాంబు పేలుడు.. ఏడుగురు మృతి… దానికి సభలోని…
భారతదేశంలోని మహిళలు చీరకట్టు అంటే ఎంతో ఇష్టం. అది మన సంప్రదాయానికి సూచిక కూడా. అయితే కేరళలో చీరకట్టు అంశం వివాదం రేపుతోంది. ఆ రాష్ట్రంలో మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని పలువురు టీచర్లు కేరళ విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు స్పందించారు. టీచర్లు తప్పనిసరిగా చీరలు ధరించాలనే పద్ధతి సరికాదని పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఆడవారి…
ఆఫ్ఘన్ లో పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా తయారవుతున్నాయి. అమెరికా బలగాల ఉపసంహరణ అనంతరం తాలిబాన్ ప్రభుత్వ ఏర్పాటుతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆఫ్ఘన్ లోని టీచర్లు గత నాలుగు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని టీచర్లు రోడ్డెక్కారు. జీతాలు రాకపోవడంతో తమకు కుటుంబపోషణతో పాటు పూట గడవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఒక్క హెరాత్ ఫ్రావిన్స్‌లోనే 30కి పైగా టీచర్లకు జీతాలు చెల్లించడం లేదంటున్నారు. ఇప్పటికైనా తాలిబాన్ ప్రభుత్వం తమకు…
ప్రభుత్వ ఉద్యోగమంటే.. పదోన్నతులు.. బదిలీలు కామన్. సమయం సందర్భాన్ని బట్టి అవి జరిగిపోతూ ఉంటాయి. తెలంగాణలో టీచర్లకు మాత్రం ఈ రెండు అంశాలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. కొన్నేళ్లుగా గ్రహణం వీడటం లేదు. ఎందుకిలా? ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదా? లేక.. టీచర్ల వైపు నుంచి ఏదైనా లోపం ఉందా? పదోన్నతులు.. బదిలీలకు టీచర్లు దూరం..! తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆరేళ్లుగా పదోన్నతులు లేవు. మూడున్నరేళ్లుగా బదిలీలు బంద్. ఈ రెండు అంశాలపై ఉపాధ్యాయ సంఘాలు పోరాటం…
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీనగర్‌లోని ఈద్గాం సంగం పాఠశాలపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు టీచర్లు మృతి చెందారు. ఇద్దరు ఉపాధ్యాయులకు పాయింట్ బ్లాక్ లో కాల్చడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు. మృతి చెందిన ఇద్దరు టీచర్లు సిక్కు, కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన సతీందర్ కౌర్, దీపక్ చాంద్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు, ఆర్మీ సంఘటనా స్థాలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదుల కోసం…
ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం.. అసలు రైతును మించిన గురువే లేడని వ్యాఖ్యానించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం అంతరాష్ట్ర అరటి మార్కెట్ పరిశీలించిన ఆయన.. అరటి గెలలు అమ్ముకుంటున్న రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతును మించిన గురువు లేడన్నారు.. నేను 12 ఎకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తూ రైతులను కలసి వారి కష్టాలను తెలుసుకుంటున్నానని.. అరటి రైతుల ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం వెదురు కర్రలు,…
కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు విద్యకు దూరంగా ఉన్న విద్యార్ధులు.. ప్రభుత్వ నిర్ణయంతో బడిబాట పట్టారు. స్కూళ్లు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఒక్కొక్కరుగా స్కూలుకు చేరుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చెశామని చెబుతున్నా… కరోనా భయం మాత్రం విద్యార్థులను వీడడం లేదు. తెలంగాణ స్కూళ్లలో అప్పడే కరోనా కలవరం మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. వారంపాటు…