Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ప్రచారపర్వంలోకి దిగారు టీడీపీ అధినేత చంద్రబాబు… 2024 ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నాందిగా అభివర్ణించారు.. పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యం ఓటు తెలుగుదేశానికి రెండో ప్రాధాన్యం ఓటు పీడీఎఫ్‌కు వేయాలని.. వైసీపీకి ఎవరూ ఎలాంటి ఓటు వేయొద్దు అని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీలో లేకపోయినా మొదటి ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యం ఓట్లను ఏపీటీఎఫ్, పీడీఎఫ్ అభ్యర్థులకు…
రేపటి పౌరుల నేటి అవసరం టెక్నాలజీ.. అందుకే ట్యాబ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… బాపట్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. యడ్లపల్లి హైస్కూల్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. 4.59 లక్షల మంది విద్యార్థులు, 59,176 ఉపాధ్యాయులకు రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేస్తుంది సర్కార్.. ఇక, తన పుట్టిన రోజునాడే ఈ కార్యానికి శ్రీకారం చుట్టిన సీఎం.. ఈ సందర్భంగా…
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువస్తామని మంగళవారం ప్రకటించింది. బోధనేతర పనుల వల్ల విద్యార్థులకు పాఠాలు చెప్పడంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారని ఇటీవల ప్రభుత్వ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే వచ్చే ఎన్నికల్లో టీచర్ల స్థానంలో ఎవరు విధులు నిర్వహిస్తారని అందరి మదిలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఎన్నికలు అంటే తొలుత…
ఉపాధ్యాయుల విధుల విషయంలో కీలక సవరణలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉపాధ్యాయులకు విద్యాయేతర విధుల నుంచి పూర్తిగా మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది.. దశాబ్దాలుగా ఉపాధ్యాయులు చేస్తున్న ఎన్నికల విధులు, జన గణన వంటి విధుల నుంచి ఇక మినహాయింపు లభించనుంది.. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది.. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో మంత్రుల సంతకాలు కూడా పూర్తి చేశారు.. దీంతో, ఉపాధ్యాయుల విధుల సవరణపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి…
విద్యార్థి తన జీవితాన్ని అంతం చేసుకునేందుకు తీవ్ర చర్యలు తీసుకుంటే ఉపాధ్యాయులను మాత్రమే నిందించకూడదని, వారి భవిష్యత్తును రూపొందించడంలో తల్లిదండ్రులు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తారని మద్రాసు హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది.
సర్కారు బడుల్లో జియో అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ.. తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సర్కారు ఆదేశాలతో జియో అటెండెన్స్ అమలు చేస్తున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో 1156 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 5వేలకు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. చాలా స్కూళ్లలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని .. ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విద్యాశాఖ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరి చేసింది. సర్కారు నిర్ణయంతో ఉపాధ్యాయుల్లో కొత్త టెన్షన్‌కు మొదలైంది. ఇటీవల డిచ్‌పల్లిలో…