ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ జిల్లాలోని ఓ పాఠశాలలో వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక మగ టీచర్, ఒక మహిళా టీచర్ ఒకరినొకరు చెప్పుతో కొట్టుకోవడం కనిపించింది. ఈ సమయంలో మగ ఉపాధ్యాయుడు స్వయంగా వీడియో తీస్తున్నాడు. దీనిపై మరింత ఆగ్రహించిన మహిళా ఉపాధ్యాయురాలు అతనిని చెంపదెబ్బ కొట్టింది. నువ్వు వీడియో తీస్తావు అని మహిళా టీచర్ మగ టీచర్ పై…
Jangaon Hostel: జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తిలోని మహాత్మా జ్యోతిబాఫూలే హాస్టల్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి గోడ దూకి 19 మంది విద్యార్థులు పరారయ్యారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ.. దీనిపై మీడియాతో మాట్లాడిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. మేం ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్టు ఏసీబీ ఎస్పీ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారని తెలిపారు.. అవినీతి చేసిన మంత్రులందరూ తగిన మూల్యం చెల్లించాల్సిందే అని హెచ్చరించారు.
Teacher Transfers: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను విద్యాశాఖ నేటి నుంచి ప్రారంభించనుంది. మల్టీజోన్-1లో ఇవాల్టి నుంచి ఈ నెల 22 వరకు..
పట్ట భద్రుల సీట్ బీఆర్ఎస్ సొంతం చేసుకుంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన పట్ట భద్రుల ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
ఎండల తీవ్రతతో సతమవుతున్న ఓ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన చేశారు. ఎండలబారి నుండి రక్షించుకునేందుకు తరగతి గదినే స్విమ్మింగ్ పూల్‌గా మార్చాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగాయి. తీవ్ర ఎండలతో అక్కడి జనాలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో.. పాఠశాల విద్యార్థులు ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తరగతి గదుల్లో ఒకదానిని తాత్కాలిక స్విమ్మింగ్ పూల్‌గా మార్చాడు ఉపాధ్యాయుడు.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలలో మరోసారి బాలికలు సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా 2803 పాఠశాలలో విద్యార్థులకు 100% ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 17 స్కూల్స్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఏలూరుకు చెందిన ఆకుల వెంకట నాగసాయి మనస్వి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 600 మార్కులకు 599 మార్కులు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. దీనితో ఆ అమ్మాయి స్టేట్ టాపర్ గా నిలిచింది. ఆకుల వెంకట నాగ…
TS TET 2024: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) దరఖాస్తు ప్రక్రియ నిన్న (బుధవారం) నుంచి ప్రారంభమైంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో https://tstet2024.aptonline.in/tstet/లో దరఖాస్తు చేసుకోవచ్చు.