Kishan Reddy: గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నత విద్య పొందిన వారే టీచర్స్ గా ఉంటారు..
- నవంబరు 8వ తేదీన జరగనున్న దిశ మీటింగ్..
- హైదరాబాద్ నగర అభివృద్ధి- ప్రభుత్వ పాఠశాలలపై అధికారులతో చర్చిస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నత విద్య పొందిన వారే టీచర్స్ గా ఉంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సీతాఫల్ మండి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జామై ఉస్మానియా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో BDL వారి సహకారంతో టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్, ఫర్నిచర్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో అధికశాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం పొందుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నప్పటికీ పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలే దేశానికి పట్టుగొమ్మలు. రానున్న రోజుల్లో మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
Read also: Ponnam Prabhakar: కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదు..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
సమాజం అంతా ప్రభుత్వ స్కూళ్లను మెరుగుపర్చేలా బాధ్యత తీసుకోవాలన్నారు. వివిధ స్కూళ్లలో విద్యార్థులకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి, పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలన్నారు. మన గుడి-మన బడి. అందుకే.. పాఠశాలల్లో పరిశుభ్రత పాటించి, ఆరోగ్యంగా ఉండేలా దోహదపడాలని తెలిపారు. దేశంలో స్వచ్ఛభారత్ కారణంగా అనేక మంది ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ల్యాబ్స్, ఫర్నిచర్ తో పాటు పరిశుభ్రత దృష్ట్యా హైప్రెషర్ టాయ్‌లెట్ క్లీనింగ్ మిషన్లను అందజేయడం జరుగుతోందని అన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నత విద్య పొందిన వారే టీచర్స్ గా ఉంటారన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల ఒత్తిడికి, మానసిక ఇబ్బందులకు గురికావొద్దు. పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లలో చేర్పించాల్సిన బాధ్యతను పేరెంట్స్ తీసుకోవాలన్నారు.
Read also: Medak Crime: దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి..
ప్రైవేటు స్కూళ్లకు మేం వ్యతిరేకం కాదు.. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన ఫలితాలు వచ్చేలా రాజకీయ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రతిఒక్కరు చొరవ తీసుకోవాలని తెలిపారు. నవంబరు 8వ తేదీన జరగనున్న దిశ మీటింగ్ లో హైదరాబాద్ నగర అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలపై అధికారులతో చర్చిస్తామన్నారు. సీతాఫల్ మండి హైస్కూల్ కొత్త బిల్డింగ్ నిర్మాణం, అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో విద్యావ్యవస్థ మెరుగుపర్చుకోవాలని తెలిపారు. 33 సంవత్సరాల తర్వాత దేశంలో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ప్రాథమిక విద్యకు ప్రాధాన్యతనిచ్చే విధంగా, ప్రోత్సహించేలా మాతృభాషను రక్షించుకునేలా విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. హైస్కూల్స్ లో కూడా వివిధ రకాల ఒకేషనల్ కోర్సులను తీసుకువచ్చేలా నూతన విద్యావిధానాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలన్నారు.
Ramayan : ఇంతకీ రణబీర్, సాయిపల్లవిల రామాయణం ఉన్నట్లా లేనట్లా ?
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!