GVMC: గ్రేటర్ విశాఖలో వైసీపీకి ఊహించని షాక్..!
- గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)లో వైసీపీకి షాక్..
- టీడీపీలో చేరేందుకు సిద్ధమైన 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి..
- ఆసక్తికరంగా మారుతోన్న విశాఖ మేయర్ అవిశ్వాస పరీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVMC: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ అవిశ్వాస పరీక్షకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ కండువా కప్పేసుకోవడానికి సిద్ధం అయ్యారు. గాజువాక ప్రాంతానికి చెందిన వంశీ.. వైసీపీకి గుడ్‌బై చెప్పి.. పార్టీ మారడం ఆసక్తికర పరిణామం. అయితే, తిప్పల వంశీ రెడ్డి తండ్రి తిప్పల నాగిరెడ్డి 2019 ఎన్నికల్లో.. గాజువాక నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విజయం సాధించారు. గత ఎన్నికలో టిక్కెట్ లభించకపోయినా జగన్మోహన్ రెడ్డి వెన్నంటే వున్నారు. ప్రస్తుతం వంశీ సోదరుడు దేవన్.. గాజువాక వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. మరో ముగ్గురు కార్పొరేటర్లను తమవైపు తిప్పుకో గలిగితే కూటమి మ్యాజిక్ ఫిగర్‌కు చేరువయినట్టే లెక్క. మరోవైపు, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఇటీవల కూటమిలో చేరిన వాళ్లకు టచ్‌లోకి వెళ్లింది. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఎటువంటి ఒత్తిళ్లు లేకుండానే కార్పొరేటర్లు.. తమ పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పారు. మేయర్ పీఠం మారుతుందనే కాన్ఫిడెన్స్ తమకు ఉందన్నారు పల్లా శ్రీనివాస్..
Read Also: Perni Nani: ఎన్టీఆర్‌లా అభిమన్యుడు కాదు.. అర్జునుడిలా మీ కుట్రలు ఛేదిస్తారు..!
Also Read
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
మొత్తంగా విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో మరో ట్విస్ట్ వచ్చి చేరినట్టు అయ్యింది.. కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డితో ఉదయం నుంచి ఓ హోటల్లో మంతనాలు సాగించారు TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్., ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీ యాదవ్.. అయితే, మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా రెండు ఓట్లు దూరంలో ఉంది కూటమి. మేయర్ పీఠం ఖచ్చితంగా కూటమిదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.. కాగా, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం చుట్టూ రాజకీయం రసకందాయంలో పడింది. అవిశ్వాసం నెగ్గితే మేయర్, డిప్యూటీ మేయర్ పంపకాలపై కూటమిలో ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది.. డిప్యూటీ మేయర్ పై క్లారిటీ రాకుండా క్యాంప్ రాజకీయాలకు వెళ్లలేమని జనసేనలో సగం మంది కార్పొరేటర్లు తేల్చేశారట.. దీంతో అటు టీడీపీ, ఇటు జనసేన నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు., క్యాంప్ రాజకీయాలు దేశం దాటేయడంతో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. టీడీపీ కార్పొరేటర్లు మలేషియాలో మకాం వేస్తే.. వైసీపీ తన వర్గాన్ని శ్రీలంకలో మోహరించింది. కమ్యూనిస్టు పార్టీలకు ఇద్దరు సభ్యులు ఉండగా.. అవిశ్వాసం ఓటింగ్ కు దూరంగా ఉంటారని సమాచారం. ఇక, ఈ నెల 19వ తేదీన జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. మేయర్ హరి వెంకట కుమారి అవిశ్వాస పరీక్షలో నెగ్గుతారా..? లేదా..? అనేది అప్పుడు తేలనుంది..
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?