CM Chandrababu: ఇవాళ ఉదయం 9. 30 గంటలకి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయనున్నారు.
ఒకప్పుడు ఆ పదవి తీసుకోమంటే…. అబ్బా… ఇప్పుడొద్దులే, చూద్దాంలే, చేద్దాంలే అంటూ ఎక్కడలేని సణుగుళ్ళూ సణిగిన నేతలంతా ఇప్పుడు పోటీ పడుతున్నారట. పైగా మాకంటే మాకంటూ పైరవీలు సైతం మొదలుపెట్టేశారట. అప్పట్లో ఎవరో ఒకరులే అనుకున్న టీడీపీ అధిష్టానం సైతం…. ఇప్పుడు ఆచితూచి అన్నట్టుగా ఉందట. ఉన్నట్టుండి అంతలా కాంపిటీషన్ పెరిగిపోయిన ఆ పదవి ఏది? ఎందుకు ఒక్కసారిగా అలా డిమాండ్ పెరిగిపోయింది? తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతోందట. ఇన్నాళ్ళు రాష్ట్ర పార్టీ బాధ్యతలు…
టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ఈ సందర్భంగా మాజీమంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి మాట్లాడుతూ.. “నిజమైన తెలుదేశం కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ తెలుగు ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తేవటానికి పుట్టిన పార్టీ అని చెప్పారు.. ఆయన చెప్పిన చరిత్ర మామూలు చరిత్ర కాదు.. టీడీపీ ఆవిర్భవించిన రోజు చంద్రబాబు కాంగ్రెస్ జెండా మోస్తున్నారు.. ఇందిరా గాంధీ ఆజ్ఞాపిస్తే ఆయన మామ చంద్రబాబు…
మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే పది రోజుల్లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ గురించి సమాచారం అందించారు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. క్లైమోర్ మైన్స్ కే భయ పడలేదు.. కామెడీ పీస్ కు భయపడతామా? అన్నారు..
ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు.. టీడీపీ ఒక సంచలనం.. రాజకీయ అవసరం.. టీడీపీకి నేను టీమ్ లీడర్ ని మాత్రమే.. మనం వారసులం మాత్రమే కానీ.. పెత్తందార్లము కాదు అని చెప్పుకొచ్చారు.
GVMC Budget: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. మేయర్ పై అవిశ్వాసం నోటీసులతో రాజకీయ పక్షాల్లో ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది.
MLA Kolikapudi: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ పార్టీలో కాక రేపుతుంది. గత కొంత కాలంగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొలికపూడి ఎపిసోడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యే కొలికపూడి టీడీపీ అధిష్టానానికి కొరుకుడు పడటం లేదా? ఏకంగా పార్టీకే డెడ్లైన్ పెట్టి అల్టిమేటమ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఆయన ఇన్నాళ్ళు చేసిన రచ్చ ఒక ఎత్తు, తాజా వివాదం మరో ఎత్తులా ఉండబోతోందా? ఎమ్మెల్యే వాఖరి మీద పార్టీ పెద్దలు సీరియస్గానే ఉన్నారా? తిరువూరు ఎమ్మెల్యే గురించి టీడీపీలో ఏమని మాట్లాడుకుంటున్నారు? ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి ఆందోళనల్లో చురుగ్గా పాల్గొనడం, ఎగ్రెసివ్ నేచర్తో సీఎం చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు కొలికపూడి శ్రీనివాస్.…
Minister Ramprasad Reddy: అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండలం బోరెడ్డిగారి పల్లెలో తన నివాసం దగ్గర రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా దర్బార్ కు స్థానిక ప్రజలు భారీగా తరలి వచ్చారు.