Veeraiah Chowdary Incident: ప్రకాశం జిల్లాలో దారుణ హత్యకు గురైన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి కేసును ఛేదించారు పోలీసులు.. ఈ హత్య కేసులో 11 మంది నిందితులను గుర్తించారు.. అయితే, తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో పరారీలో మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరయ్య స్వగ్రామం నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకి చెందిన ఆళ్ల సాంబయ్య ప్రధాన కుట్రదారుడిగా గుర్తించారు.. నిందితుల్లో వీరయ్య స్వగ్రామానికి చెందిన ముప్పా సురేష్, దేవేంద్రనాథ్ చౌదరి కూడా ఉన్నారు..
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
అయితే, ఇసుక వ్యాపారం చేసే వినోద్ అనే వ్యక్తితో నెల్లూరుకి చెందిన నలుగురు కిరాయి ముఠాతో కలసి హత్య చేసినట్టు పోలీసుల తమ దర్యప్తులు తేల్చారు.. రాజకీయ, వ్యాపారాల్లో విభేదాలు నేపథ్యంలో వీరయ్య చౌదరిని సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో హత్య చేయించినట్టు వెల్లడించారు.. వీరయ్య చౌదరిపై 50 కత్తి పోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.. గత నెల 22వ తేదీన సాయంత్రం ఒంగోలులో వీరయ్య చౌదరిని ఆయన కార్యాలయంలో విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసింది కిరాయి ముఠా.. ఇక, టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్.. ఇక, ఈ కేసులో ఎస్పీ దామోదర్ వివరించిన పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..