Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మూడు రోజుల క్రితం వంశీని విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో వైద్యం కోసం జాయిన్ చేసిన జైలు అధికారులు.. హైకోర్టు ఆదేశాల మేరకు వంశీని ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 5వ తేదీన వంశీ ఆరోగ్య పరిస్థితిపై రిపోర్టును సీల్డ్ కవర్ లో ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: TPCC Mahesh Goud : బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా..? హరీష్ రావుకు సవాల్
అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న వల్లభనేని వంశీని వైద్యం కోసం ఆయూష్ ఆసుపత్రికి గత శుక్రవారం నాడు జైలు అధికారులు తరలించారు. పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు చికిత్స కోసం మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా విజయవాడలోని ఆయూష్ హస్పటల్ లో చికిత్స చేయించాలని ఆదేశించింది. ఈ మేరకు విజయవాడ జిల్లా జైలు నుంచి పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. నేటితో చికిత్స ముగియడంతో డాక్టర్లు ఇవాళ వల్లభనేని వంశీని డిశ్చార్జ్ చేశారు.