నవ్యాంధ్రలో తొలిసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా టీడీపీకి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏపీని ఐదేళ్లు పాలించారు. అయితే గతానికి భిన్నంగా చంద్రబాబు పాలన సాగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఐదేళ్లలో చంద్రబాబు పూర్తి చేయలేకపోయాడు. ఈ ప్రభావం గత ఎన్నికల్లో స్పష్టంగా కన్పించింది. కిందటి ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమి పాలుకాగా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ…
బద్వేల్ ఉప ఎన్నికలు అక్టోబర్ 30 వ తేదీన జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో విజయం తమదే అని టీడీపీ ధీమాను వ్యక్తం చేసింది. దివంగత మాజీ మంత్రి వీరారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతో అభివృద్ది చేశారని టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ పేర్కొన్నారు. సీఎం జగన్ బద్వేల్ అభివృద్ధికి ఇచ్చిన హామీలు…
ఆ జిల్లాలో వైసీపీ, టీడీపీల మధ్య నలిగిపోతున్నారు అధికారులు. ఏ పని చేస్తే ఎవరు విరుచుకుపడతారో తెలియక ఆందోళన చెందుతున్నారట. ఈ టెన్షన్ అంతా ఒక సర్టిఫికెట్ కోసం. దానిపైనే పెద్ద పొలిటికల్ ఫైటే జరుగుతోంది. రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దుగ్గిరాలలో క్యాస్ట్ సర్టిఫికెట్ రగడ..! కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల పొలిటికల్ పంచాయితీకి ఈ సామెత చక్కగా సరిపోతుంది. దుగ్గిరాల మండల పరిషత్ ఎన్నిక కోసం…
అనంతపురం టీడీపీలో టీజింగ్ రాజకీయం కొనసాగుతోంది. పార్టీ సీనియర్లపై వాళ్లముందే సెటైర్లు వేసిన JC ప్రభాకర్‌రెడ్డి… ఇప్పుడు ఏకంగా నియోజకవర్గ పర్యటనలు మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గాలన్నీ JCని వ్యతిరేకించే నేతలవి కావడంతో… పార్టీలో ఇది ఇంకేం సమస్యకు కారణం అవుతుందోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీకి మీరే నష్టమని అనంత టీడీపీ నేతలపై జేసీ ఫైర్..! కార్యకర్తలను నాయకులను పట్టించుకోవడం లేదు. వైసీపీ నేతలతో కొంతమంది మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు అంటూ అనంతపురం టీడీపీ నేతల సమావేశంలో…
సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్, మంత్రులపై జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాన్ని.. మంత్రులు పవన్‌పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.. ఇక, సినీ దర్శక నిర్మాత, రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.. పోసానిని పవన్ అభిమానులు టార్గెట్ చేయడం.. ఆ తర్వాత మళ్లీ పోసాని ప్రెస్‌మీట్ పెట్టి.. మెగా ఫ్యామిలీని, పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడడంపై…
గత టీడీపీ ప్రభుత్వం, హెరిటేజ్‌పై విమర్శలు గుప్పించారు సీఎం వైఎస్ జగన్.. జగనన్న పాలవెల్లువ, మత్స్యశాఖలపై సమీక్ష నిర్వహించారు సీఎం.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం– కార్యదర్శికి మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ- శిక్షణా కరదీపిక పుస్తకాలను ఆవిష్కరించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో సహకార రంగంలోని డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించారని.. కొందరు సహకార డెయిరీలను తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారని ఆరోపించారు.. సహకార…
ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్‌ను టీడీపీ సీరియస్‌గా తీసుకుంటుందా? నానిని బుజ్జగిస్తుందా? టీడీపీలో ప్రస్తుతం ఇదే చర్చ. గతంలో ఇదే మాదిరి అలిగిన బుచ్చయ్య చౌదరిని కొద్దిరోజులకే తిరిగి లైనులోకి తీసుకురావడంలో అధినాయకత్వం సక్సెస్ అయింది. మరి.. కేశినేని నానిని తిరిగి ట్రాక్‌లో పెట్టగలదా? అవమానాలు ఎక్కువై అసంతృప్తి గళాలు..! తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్క సీనియర్ నెమ్మదిగా అసమ్మతి రాగం అందుకుంటున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తమ అసంతృప్తిని బయట పెడుతున్నారు. అన్ని వేళ్లూ అధినేత, అధినేత…
బెజవాడలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది.. ఇక, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోను.. నా కూతురు కూడా ఎన్నికల్లో పోటీ చేయదంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని తెగేసే చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.. దీంతో.. బెజవాడలో టీడీపీ పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది.. కార్పొనేషన్ ఎన్నికల సమయంలో.. టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు చెక్‌పెట్టేందుకు అప్పట్లో చంద్రబాబు రంగంలోకి దిగారు.. తర్వాత అంతా కేశినేని…
దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.. అయితే, మరోసారి విజయంపై కన్నేసిన వైసీపీ.. బద్వేల్ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధా పేరును ఖరారు చేసింది.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్…
దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల సందడి మొదలైంది… తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానంతో పాటు.. ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇదే షెడ్యూల్ వర్తించనుంది.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక జరుగుతుండగా… ఈ ఎన్నికల్లో తన అభ్యర్థిగా దాసరి సుధాను ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్…