వైసీపీ దిగజారిపోయింది అనడానికి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. తెలంగాణకు చెందిన పోలీస్ అధికారి అరకులో గంజాయి ఉందని నిరూపించడానికి ప్రయత్నించి భంగపడ్డాడన్నారు. పోలీస్ అధికారిని ఉద్దేశించి అలా మాట్లాడే బదులు, తాము గంజాయి అమ్ముతున్నామని విజయ సాయి చెప్పాల్సింది. ఆ పోలీస్ అధికారి టీడీపీ మనిషన్నట్లుగా కూడా విజయసాయి మాట్లాడారు. కేసీఆర్ కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని, తనరాష్ట్ర పోలీస్ అధికారులతో చెప్పారు. అంతమాత్రాన కేసీఆర్…
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 29న కుప్పంలో పర్యటించనున్నారు. గత పది రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్యా కుప్పంలో చంద్రబాబు పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కుప్పంలో రెండు రోజులు పర్యటించనున్న చంద్రబాబు.. 29 కుప్పంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు 30న కుప్పం పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కుప్పంలో టీడీపీ ఉనికి కొల్పొకుండా ఉండేందుకు గ్రామస్థాయి…
బద్వేల్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 7గంటలకు భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉప ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. పోలింగ్ కు 72 గంటల ముందు నుంచే ఈ ప్రచారాలు ముగియడంతో మైకులు మూగబోయాయి. అయితే ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయరామారాజు, ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. బద్వేల్ నియోకవర్గంలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ పోలింగ్…
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు భగ్గమన్నాయి. ఈ ఘటనపై నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు 36గంటల దీక్ష కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర పరిణామాలను వివరించేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీకి వెళ్లిన ఆయన సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కలిసి ఏపీలో జరుగుతున్న పరిస్థితులను వివరించారు. టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విషయంపై కూడా రాష్ట్రపతికి వెల్లడించారు. అనంతరం మంగళవారం కేంద్ర…
ఇప్పటికీ ఏపీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. గత పది రోజులుగా ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏలూరు స్మార్ట్ సిటీ చైర్మన్ గా బొద్దాని అఖిల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడని, గద్దె దిగిపోతూ దిగిపోతూ ప్రజలను కష్టాల్లోకి నెట్టేసాడంటూ ఆరోపణలు…
టీడీపీ నేత పట్టాభి సడెన్గా మాల్దీవ్స్కు ఎందుకెళ్లారు? ఆయనే వెళ్లారా.. ఇంకెవరైనా పంపించారా? పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? రిలాక్సేషన్ కోసం మాల్దీవ్స్ వెళ్లిన పట్టాభి కదలికపై నిఘావర్గాలు కన్నేశాయా? చంద్రబాబే ఖర్చులకు ఇచ్చి మాల్దీవ్స్కు పంపారా? పబ్లిక ప్రెస్మీట్లో బోసడీకే పదాన్ని వాడి.. నాలుగు రోజులు AP రాజకీయాన్ని అగ్గగ్గలాడించిన టీడీపీ నేత పట్టాభి.. సడెన్గా మాల్దీవ్స్కి జంప్ అయిపోవడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెయిల్ వచ్చిన పట్టాభి తానే రిలాక్సేషన్ కోసం వెళ్లిపోయారా? లేక…
వైపీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అసాంఘీక శక్తులకు చంద్రబాబు రారాజు అని, ఢిల్లీలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి వచ్చారా? ఏపీ పరువు తీశామని చెప్పుకోవడానికి వచ్చారా అని ప్రశ్నాంచారు. పట్టాభి బూతు పురాణం వీడియోను రాష్ట్రపతికి చూపించారా? అమిత్ షా మీద రాళ్లు వేసిన వీడియోను చూపించారా? అని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. చంద్రబాబు…
అమరావతి : టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కు మరో బిగ్ షాక్ తగిలింది. ధూళిపాళ్ల నరేంద్రపై తాజాగా ఏపీ ప్రభుత్వం మరో అస్త్రం వదిలింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టును స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది సర్కార్. ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ప్రభుత్వం తరఫున నోటీసులు జారీ చేశారు. వారం…
ఇల్లు అలకగానే పండగ కాదు. ప్రస్తుతం శింగనమల టీడీపీ పరిణామాలకు ఈ సామెత అతికినట్టు సరిపోతుంది. ఇంఛార్జ్ ఉండగానే వచ్చిన టుమెన్ కమిటీకి.. రెండు మండలాలను టచ్ చేయాలంటే ధైర్యం సరిపోవడం లేదట. ఆ మండలాల్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే జేసీ బ్రదర్స్ పర్మిషన్ తీసుకోవాలట. దానిపైనే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో పెద్ద చర్చ..! శింగనమలలో టీడీపీ టు మెన్ కమిటీ బలప్రదర్శన..! అనంతపురం జిల్లా శింగనమల టీడీపీలో తలెత్తిన రచ్చ ఇప్పట్లో తగ్గేలా లేదు. రాష్ట్రంలో ఎక్కడా…
ఆంధ్రప్రదేశ్లో బూతుల పర్వం కాస్త.. కేసుల నమోదుకు దారితీసింది.. అయితే, బాధితుల మీదే కేసులు నమోదు చేస్తున్నారు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.. తనపై గుంటూరులో కేసు నమోదు చేయడంపై స్పందించిన ఆయన.. బాధితుల మీదే కేసులు పెడుతున్నారు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.. చంపుతామన్న మైదుకూరు ఎమ్మెల్యే మీద ఏం కేసులు పెట్టారు..? అంటూ ఈ సందర్భంగా నిలదీసిన ఆయన.. చంద్రబాబు మీద బాంబులేస్తామన్న కుప్పం…