ఢిల్లీః రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ ను టీడీపీ అధినేత ఎన్. చంద్ర బాబు నాయుడు కలిశారు. ఈ సందర్భంగా 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతి కి అందజేశారు చంద్రబాబు. ఏపీ లో మాదక మాదకద్రవ్యాల నెట్ వర్క్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని… రాష్ట్రంలో తక్షణం ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని ఈ సందర్భంగా రాష్ట్రపతిని కోరారు చంద్రబాబు.. అలాగే… .అక్టోబర్ 19 న జరిగిన ఘటనల పై…
ఒకే ఒక్క మాటతో టీడీపీ నాయకుడు పట్టాభి రేపిన వ్యాఖ్యల దుమారంతో రేగిన చిచ్చు ఇప్పుడు ఢిల్లీని తాకింది. వైసీపీ, టీడీపీలు ఎత్తుకు, పైఎత్తు వేస్తూ రాజకీయ వేడి రగిలిస్తున్నాయి. అయితే అధికార వైసీపీ త్రిముఖ వ్యూహంతో టీడీపీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుస్తారు. ఏపీలో వ్యవస్థలపై జరుగుతున్న దాడులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనుంది బాబు…
కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులకు కొత్త కష్టమొచ్చిందా? సైకిల్ దిగేందుకు సిద్దపడినా.. ఏ పార్టీలో చేరాలో తెలియక సతమతం అవుతున్నారా? గ్రామాల్లో తిరుగుతూ.. రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించమని పార్టీ మారిన పాత కేడర్‌ను కోరుతున్నారా? ఇది ఎత్తుగడ.. ఇంకేదైనా వ్యూహం ఉందా? ఏ పార్టీలో చేరాలో చెప్పాలని గ్రామాల్లో అడుగుతున్నారట..! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో రాజకీయ సందడి మొదలైంది. టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొత్తకోట దయాకర్‌రెడ్డి,…
ఆయనో మాజీ మంత్రి. అధికారంలో లేకపోయినా తనదైన ఎత్తుగడలతో చర్చల్లో ఉంటారు. కొంతకాలంగా హైకమాండ్‌తో దూరం పాటిస్తున్నారు. రాజకీయ భవిష్యత్‌పై ఎన్నో ఊహాగానాలు, మరెన్నో అంచనాలు వినిపించాయి. కానీ.. హఠాత్తుగా యూటర్న్ తీసుకుని ఇప్పుడు మళ్లీ పార్టీకి విధేయత ప్రకటిస్తున్నారు. ఇంతకీ ఆయనలో వచ్చిన ఈ మార్పునకు కారణం ఏంటి? ఎవరా నాయకుడు? రెండేళ్లుగా గంటా రాజకీయ ప్రయాణంపై చర్చ..! గంటా శ్రీనివాసరావు. విశాఖజిల్లా రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఒక వెలుగు వెలిగారు.…
టీడీపీ నేత పట్టాబి వ్యాఖ్యలతో రేగిన రాజకీయ కాక.. ..క్షణక్షణానికి కొత్త మలుపులు తిరుగుతోంది. నాలుగు రోజులుగా రాష్ట్రంలో పతాకస్థాయికి చేరిన రాజకీయ ఉద్రిక్తతల సెగ.. ఇప్పుడు ఢిల్లీకి చేరింది. హస్తినలోనూ పైచేయి సాధించాలని ఇరుపక్షాలు.. వ్యూహాలకు తెరలేపాయి. ఇది ఇలా ఉండగా… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన పట్టాభి నిన్న రాత్రి బెయిల్‌పై రిలీజయ్యారు. గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్టైన పట్టాభికి 14 రోజుల జ్యుడీషియల్…
ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్కసారే. పదవి తెచ్చిన వన్నెకంటే కాంట్రవర్సీతో వచ్చిన గుర్తింపే ఎక్కువ. అలాంటి నాయకుడిని ఓ మాజీ మంత్రితో జతకట్టించింది అధిష్ఠానం. కలిసి కాపురమైతే చేశారు కానీ ఎవరి కుంపట్లు వారివే. ఇప్పుడు ఆ ఇద్దరూ టికెట్ నాదంటే నాదని పోటీ పడుతున్నారట. ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని గుర్తించిన హైకమాండ్ మధ్యేమార్గం నిర్ధేశించిందని టాక్. ఇంతకీ ఎవరా నేతలు? ఏమా కాంట్రవర్సీ? పెందుర్తి టికెట్ కోసం కోల్డ్‌వార్..! మాజీ మంత్రి బండారు…
మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. వచ్చే ఎన్నికల వరకు ఎందుకు..? ఇప్పుడే రాజీనామా చేస్తున్నానంటూ ఎన్టీవీ ఇంటర్వ్యూలో సవాల్ విసిరారు.. అంతేకాదు.. ఖాళీ లెటర్ హెడ్‌పై సంతకం చేసి ఇచ్చారు.. తాను రాజీనామా చేస్తున్నట్టు రాసి స్పీకర్‌కు పంపాలని పరిటాల సునీతకు సూచించారు.. తాను పరిటాల సునీతను వదినగానే చూస్తాన్న వంశీ.. కానీ, తల్లికి, గర్బస్థ శిశువుకు మధ్య గొడవలు పెట్టగలిగినంత తెలివైన…
ఏపీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆంధ్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. నేతలు పరస్పరం ఒకరినొకరు వ్యక్తిగత దూషణలతో రాజకీయాలు మరో యుద్ధాన్ని తలపిస్తున్నాయి. తాజాగా మంత్రి అనిల్‌కుమార్ ప్రతి పక్ష నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడన్నారు. చంద్రబాబు నాయుడు. ఆయన సుపుత్రుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని అనరాని మాటలు అన్నారన్నారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ సీఎంను ఆయన తల్లిని విమర్శిస్తే ఉప్పు ,కారం తిన్న వారు ఎవరు చూస్తూ…
అమరావతి : తెలుగు దేశం ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తో జరిగే సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యనమల, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో సీనియర్ నేతలతో భేటీ అయ్యారు చంద్రబాబు. సోమవారం రాష్ట్రపతిని కలవనున్నారు చంద్రబాబు మరియు టీడీపీ నేతలు. రాష్ట్రపతి తో పాటు ఇంకా ఎవరెవర్ని కలవాలనే దానిపై నేతలతో ఇవాళ చర్చించారు చంద్రబాబు. ఇక…