వైసీపీ దిగజారిపోయింది అనడానికి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. తెలంగాణకు చెందిన పోలీస్ అధికారి అరకులో గంజాయి ఉందని నిరూపించడానికి ప్రయత్నించి భంగపడ్డాడన్నారు. పోలీస్ అధికారిని ఉద్దేశించి అలా మాట్లాడే బదులు, తాము గంజాయి అమ్ముతున్నామని విజయ సాయి చెప్పాల్సింది. ఆ పోలీస్ అధికారి టీడీపీ మనిషన్నట్లుగా కూడా విజయసాయి మాట్లాడారు. కేసీఆర్ కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని, తనరాష్ట్ర పోలీస్ అధికారులతో చెప్పారు. అంతమాత్రాన కేసీఆర్ కూడా టీడీపీ వ్యక్తేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 25వేల ఎకరాల్లో గంజాయి సాగు అవుతోందని అందరికీ తెలుసు. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ పోలీసులు ఏపీ గంజాయిని పట్టుకున్నా కూడా, సీఎం జగన్ దానిపై మాట్లాడరు.
ఏపీ డీజీపీ కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపుతామంటున్నారు. ఏపీ డీజీపీని కూడా పలానా పార్టీ వ్యక్తని అంటారా అని అడిగారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన ఆధారాలు అడిగే హక్కు విజయసాయికి ఉందా.. విజయసాయిరెడ్డేదో ఉత్తమ పురుషుడు అయినట్లు మాట్లాడితే ఎలా అన్నారు. ఆయనకు నిజంగా దేశభక్తి ఉంటే, రాష్ట్రంలో గంజాయి పట్టుకున్న పోలీసులను అభినందించాలి. తన వ్యాఖ్యలతో విజయసాయి రెడ్డే అల్లరవుతున్నాడు అని పేర్కొన్నారు.