స్థానిక సంస్థల ఎన్నికల ప్రకియ దుర్మార్గంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడే ఏకగ్రీవాలు పెరిగాయని, బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగిందన్నారు.
ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపణలు చేశారు. అభ్యర్థులు కోర్టుకు వెళితే.. మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. రైతులు పాదయాత్ర చేస్తుంటే అక్కడ కూడా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందన్నారు.