సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుక మందమంటూ చంద్రబాబు గర్వంగా, అహంకారంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లాస్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. బాబుకు మోసం తప్ప చిత్తశుద్ధి తెలియదని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు బాబుపై నమ్మకం పోయిందని.. పార్టీ నేతలు, కార్యకర్తలు బాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఇషాక్ బాష , కల్పలత రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు శిల్ప చక్రపాణి రెడ్డి, గంగుల బిజేంద్ర రెడ్డి , కాటసాని రామిరెడ్డి , మాజీ ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు.
READ MORE: Cricketer Died: సిక్స్ కొట్టి కుప్పకూలిన యువకుడు.. గుండెపోటుతో మృతి