వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటన గుంటూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. నిన్న వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటనలో పోలీసులు ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీంతో వారి అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ నేత అరవింద్ బాబు ధర్నా చేపట్టారు. పోలీసులు అరవింద్ బాబు ధర్నా చేపట్టిన స్థలానికి చేరుకొని ధర్నా ఆపే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో అరవింద్‌కు గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.…
కోడిపందాలు జూదం కాదు.. సంస్కృతిలో భాగమని వైసీపీ మంత్రి రంగనాథరాజు అన్నారు. ఆదివారం ఆయన ఏపీ ప్రజలందరికీ కనుమ పండుగ శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంస్కృతి, చట్టాలను రెండింటిని గౌరవించాలని, కోడి పందాలు సంప్రదాయంగా చట్టబద్ధంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం పేదలకు ఇళ్లు, ఇళ్లస్థలాలు కేటాయిస్తోందిని, ఇళ్ల నిర్మాణానికి రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఓటీఎస్ ద్వారా యాజమాన్య హక్కులు అందిస్తున్నామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు…
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరోసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు పై తీవ్రంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో శవరాజకీయాలు చేసేది చంద్రబాబే నని అది అందరికి తెలుసని చెప్పారు. హత్యారాజకీయాలు, కుట్రలు చేసే అలవాటు చంద్రబాబుకే ఉందన్నారు. నరకాసురుడు, బకాసురుడు చంద్రబాబే అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు రాక్షస ఆలోచనలు భోగి మంట్లలో తగలబడాలని కోరుకుంటున్నా అంటూ మంత్రి వెల్లంపల్లి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. Read Also: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ .. ఐదు…
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్య హత్య కేసు కలకలం సృష్టించింది.. అయితే, హత్య జరిగిన 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు పోలీసులు.. మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటించారు.. ఈ హత్యకు ప్రధాన కారణం పాత తగాదాలు అని మా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు తెలిపారు.. మృతుడు తోట చంద్రయ్య మరియు ప్రధాన నిందితుడు చింతా శివ రామయ్య…
మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేత చంద్రయ్యపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. అయితే చంద్రయ్య అంత్యక్రియల్లో టీడీపీ అధినేత పాల్గొని మాట్లాడుతూ.. వైసీపీ హత్యారాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. దీనిపై స్పందంచిన ఎమ్మెల్యే జోగిరమేశ్ హత్యా రాజకీయాలకు పేటెంట్ అంతా చంద్రబాబుదేనని అన్నారు. ఒంటరిగా మమ్మల్ని ఎదుర్కొనే సత్తా లేకే చంద్రబాబు పొత్తుల కోసం ఆరాటపడుతున్నారని, పొత్తుల ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ప్రజలకు అభివృద్ది సంక్షేమ ఫలాలు బ్రహ్మాండంగా అందుతున్నాయని,…
ఏపీలో భోగి పండుగ రోజు కూడా టీడీపీ నేతలు వారి నిరసనలు తెలపడానికి విరామం ఇవ్వడం లేదు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, ప్రజలకు నష్టకలిగించే జీవోలు ప్రవేశపెడుతోందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ రోజు భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ భోగి మంటలు వేసి ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. అయితే కృష్ణాజిల్లాలో గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు భోగి మంటలు వేశారు. అంతేకాకుండా ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో…
మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ నేత చంద్రయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. చంద్రయ్య మృతదేహం గుండ్లపాడుకు తరలించారు. గుండ్లపాడుకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు. గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపారు. చంద్రయ్య గ్రామ సెంటర్లో కూర్చుని ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం ప్రత్యర్థులు పరారయ్యారు. చంద్రయ్య హత్యను చంద్రబాబు ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.చంద్రయ్య హత్య బాధాకరమన్నారు. అధికారం ఎవ్వరికి శాశ్వతం…
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులపై పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను అక్రమాలు చేస్తే నిరూపించాలి ఒట్టి మాటలు మాట్లాడొద్దు అంటూ ఫైర్ అయ్యారు. మా మామ కమ్యూనిస్టు కృష్ణారావు పేరు మీద ఎయిర్‌పోర్టు వద్ద 200 ఎకరాలు ఉన్నాయన్నారు. అది నిరూపిస్తే.. 200 ల ఎకరాలను ఆర్డీటీ సంస్థకు అప్పగిస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ర రెడ్డితో పాటు ఆయన సోదరుల పేరు మీద ఎన్నో ఆస్తులున్నాయని పరిటాల…
గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన చంద్రయ్య అనే వ్యక్తిపై నిన్న రాత్రి కత్తులతో, కర్రలతో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్యచేశారు. ఈ నేపథ్యంలో చంద్రయ్య హత్యపై టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా.. హత్యా రాజకీయాల వారసుడు జగన్ సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందిని ఆయన ఆరోపించారు.…