వర్గ విభేదాలు ఆ నియోజకవర్గం టీడీపీలో చిచ్చు పెట్టాయా? కొత్తగా వచ్చే ఇంఛార్జ్‌పై సస్పెన్స్ కొనసాగుతోందా? ప్రస్తుత ఇంఛార్జ్ తగ్గేదే లేదని చెబుతున్నారా? ఇద్దరు మాజీ మంత్రుల ఎత్తుగడ మధ్య టీడీపీ రాజకీయం మలుపులు తిరుగుతోందా? మాజీ మంత్రుల్లో ఎవరి మాట నెగ్గుతుంది?తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ టీడీపీ కొత్త ఇంఛార్జ్ ఎవరు? ఈ విషయంలో టీడీపీ అధిష్ఠానం ఎందుకు సస్పెన్స్ కొనసాగిస్తోంది? ఆ నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లకు అర్థం కావడం లేదట. మాజీ ఎమ్మెల్యే పిల్లి…
పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలు పై నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పాలకోల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఇతర టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులపక్షాన పోరాడి వైసీపీ ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. రైతులకోసం కేంద్రప్రభుత్వ సాయంతో అమలుచేసే పథకాలకు జగన్ తిలోదకాలు ఇస్తున్నారని విమర్శించారు.…
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో గత మూడు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ రోజు శెట్టిపల్లె గ్రామ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. రామకుప్పం మండలం శివాజీ నగర్లో అంబేద్కర్ విగ్రహ వివాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎంగా ఉండే వ్యక్తి చేపల మార్కెట్ గురించి మాట్లాడుతారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారతి సిమెంట్ రేటు తగ్గించరు.. కానీ సినిమా టికెట్ లు తగ్గిస్తారట అంటూ విమర్శించారు. సీఎం జగన్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించారు. ఐఆర్…
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుప్పం నుంచే పోటీ చేస్తానని, గెలిచి సీఎంను అవుతానని ధీమా వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్‌గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. మేము బెదిరిపోయే పరిస్థితి లేదు, చంద్రబాబుకి కాలం మూడింది అని ఆయన అన్నారు. చంద్రబాబు కుప్పంలోనే పోటీ చేస్తాను అనడాన్ని ఆహ్వానిస్తున్నామని, చంద్రబాబు పోటీ చేస్తాడు, కుప్పంలో ఓడిపోతాడు. పారిపోకూడదని మేము ఆశిస్తున్నాం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీ ఓటమి కుప్పంలో…
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం నుంచే పోటీ చేస్తానని, మళ్లీ సీఎం అవుతానని ఆయన అన్నారు. అంతేకాకుండా స్థానిక నేతలు మారకపోతే వాళ్లనే మార్చేద్దాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎన్నికలు ప్రహసనంలా మారాయని ఆయన అన్నారు. మద్యం తయారీలో రసాయనాలు కలుపుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం పాడవుతుంటే మరో వైపు దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారు అని ఎద్దేవా చేసిన ఆయన.. అవసరమైనప్పుడు లవ్ చేయడంలో చంద్రబాబు సమర్దుడు అని వ్యాఖ్యానించారు.. గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా లవ్ చేశారని.. చంద్రబాబు అవకాశవాది.. అవసరమైనప్పుడు లవ్ చేస్తారు.. ఆ తర్వాత ఏం చేస్తారో నా నోటితో నేను చెప్పలేను అని హాట్ కామెంట్లు చేశారు. ఇక, జనసేన పార్టీ మా మిత్రపక్షం…
ఏపీ పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన టీడీపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నట్లు టీడీపీ తీరు ఉందని విమర్శించారు. Read Also:జగ్గారెడ్డి కీలక నిర్ణయం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా . హెరిటేజ్ లో రేట్ల కన్నా మార్కెట్ రేట్ తక్కువగా ఉందన్నారు. హెరిటేజ్‌లో ఆశీర్వాద్ గోధుమ పిండి కేజీ. రూ.59 ఉంటే మార్కెట్ రేటు 52 రూపాయలు ఉందన్నారు. అలాగే…
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రామకుప్పం మండలం అరిమాను పెంట గ్రామంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అమ్మ, చెల్లిలను రాజకీయంగా వాడుకొని వదిలేసాడని సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా పోలవరం 71 శాతం పూర్తి చేసామని, ఇవ్వాళే భారతి సిమెంట్ బస్తా పై 30 రూపాయలు పెంచారని ఆయన మండిపడ్డారు. మూడేళ్ల పాలనలో జగన్ మూడు ఇళ్లు కూడా నిర్మించలేదని, సాక్షిలో మేనేజర్‌గా పని చేసే వ్యక్తి నన్ను…
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు పర్యటనపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ఎన్నికలప్పుడే చంద్రబాబు కుప్పంకు వచ్చే వారని, ఈరోజు గ్రామాలు తిరగాలని చంద్రబాబు ఆలోచన చేశారన్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకా కుప్పంలో చంద్రబాబు పర్యటించని గ్రామాలు ఉన్నాయని, సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మేము మా ఎమ్మెల్యేలు అన్ని గ్రామాలు తిరుగుతున్నామన్నారు. కేవలం…
నేడు టీడీపీ అధినేత కుప్ప నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా రెండు ఘటనలు కుప్పంలో నన్ను బాధించాయని ఆయన అన్నారు. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు నన్ను బాధపెట్టాయని, కుప్పంలో డబ్బులు పంచే తీరు ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. వెయ్యి, రెండు వేలు పంచి ఓట్లు అడిగే పార్టీ కాదు టీడీపీ అని, కుప్పంలో ఓటమి అంటూ నన్ను ఎగతాళి చేస్తే….మిమ్మల్ని అన్నట్లు కాదా..?…