ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్గా ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలు టీడీపీ ఎమ్మెల్యే బుద్ధావెంకన్న వర్సెస్ మంత్రి కొడాలినానిగా మారాయి. ఒకరిపై ఒకరూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా చిన్నపాటి మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. మంగళవారం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నానిపై ఫైర్ అయ్యారు. మంత్రి కొడాలి నానిది దొంగతనాలు చేసే బతుకు.. కొడాలి నానికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని బుద్ధా అన్నారు. కొడాలి నాని పాన్ పరాగ్…
రాష్ట్రంలో జగన్ దుర్మార్గపు పాలనకు తోడు పోలీసుల దౌర్జన్యం తోడైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ తీరును తీవ్రంగా విమర్శించారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్టును ఆయన ఖండించారు. సమాజంలో అల్లర్లు సృష్టిస్తూ అరాచకాలు చేస్తున్న వైసీపీ గుండాలను వదలి టీడీపీ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ నెత్తి మీద 3 సింహాలకు బదులు 3 ఫ్యాన్…
టీడీపీ నేత బుద్ధా వెంకన్నను అరెస్టు చేయడంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో కొడాలి నాని క్యాసినో నడిపితే నో పోలీస్…? అదే గడ్డం గ్యాంగ్ ప్రతిపక్షనేతని బూతులు తిడితే నో పోలీస్.. చంద్రబాబు గారి ఇంటి పై దాడి చేస్తే నో పోలీస్…టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ మూకలు ధ్వంసం చేస్తే నో పోలీస్.. ? అంటూ లోకేష్ ప్రశ్నించారు. బూతులేంట్రా సన్నాసి నాని అని బుద్ధా వెంకన్న…
గుడివాడ క్యాసినో ఘటన రోజురోజుకు ముదురుతోంది. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ పేరు చేబితే మొన్నటి వరకు గంజాయి, డ్రగ్స్ గుర్తుకు వచ్చేవని.. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పెరు చెబితే గుడివాడ , అందులో క్యాసినో గుర్తుకొస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. అన్ని విధాలా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు సూపర్ సీఎం జగన్ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. కానీ కొడాలి నాని గారు మాత్రం కరోనా తో హైదరాబాద్లో…
గుడివాడ ఘటనపై వైసీపీ,టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానలా తయారైంది. తాజాగా టీడీపీ రాష్ట్రం కార్యదర్శి బుద్ధా వెంకన్న మంత్రి కోడలి నాని నిన్న చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. 2024లో వైసీపీ ఓడిపోయిన అరగంటలో ప్రజలు నిన్ను చంపుతారని, ఓడిపోగానే రాష్ట్రం వదిలి దుబాయి పారిపోతావు అంటూ ఎద్దేవా చేశావు. క్యాసినోలో రూ. 250 కోట్లు చేతులు మారాయి.. డీజీపీ నీకు వాటా ఎంత..? కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు..?…
ఏపీలో వైసీపీ నేతలకు టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. షర్మిల ఏపీలో పార్టీ పెడితే, అందులో చేరి జగన్ను బూతులు తిట్టే మొదటివ్యక్తి కొడాలినాని అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. ప్రజలకు మేలు చేయటం చేతకాకే.. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. గుడివాడలో బస్సులు, లారీల్లో కొడాలి నాని ఆయిల్ దొంగతనం చేస్తే, అప్పుడు పోలీసు అధికారిగా ఉన్న వర్ల రామయ్య చర్యలు తీసుకోలేదా..?…
గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. గుడివాడలో అసలు క్యాసినో నిర్వహణ జరగలేదని ఆయన అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే కోడి పందాలు, పేకాట శిబిరం మాత్రమే జరిగాయని, కొడాలి నాని అనారోగ్యంతో ఉండటంతో నా స్నేహితులు శిబిరం నిర్వహించిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. శిబిరం నిర్వహించిన వారు నా స్నేహితులు, వారు ఎవరో కూడా కొడాలి నానికి తెలియదని, అది…
గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ప్రధాన విపక్ష పార్టీ టీడీపీ గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్యాసినో నిర్వహించారని ఆరోపణలు చేస్తుంటే.. అధికార పార్టీ వైసీపీ నేతలు మాత్రం అలాంటిది ఏం లేదని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ నిజానిజాలు తేల్చుకునేందుకు గుడివాడకు వెళ్లగా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఆ ఘటన తరువాత నిజ…
ఏపీలో వైసీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రధాన విపక్ష పార్టీ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్ లో అధికార వైసీపీ నేతలు ప్రశ్నలు వేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా వైఎస్ జగన్ వచ్చిన దగ్గర నుంచి స్పెషల్ ఫోర్స్ పెట్టి క్లబ్ లు మూయించిన మాట వాస్తవం కాదా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ…
గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏపీలో ప్రతీ జిల్లాకు ఎయిర్ పోర్టుకి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులని సీఎం ఆదేశించారన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్దిని చూసి టీడీపీ సహించలేకపోతోందని ఆయన అన్నారు. పెన్షన్ 2500 రూపాయిలకి పెంచితే బావురమని చంద్రబాబు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజనిర్దారణ పేరుతో టీడీపీ నేతలు డ్రామాలాడారన్నారు. గుడివాడపై ప్రేమా లేక మంత్రికొడాలి నానిపై కక్షా.. కోడిపందాలు,…