ఏపీలో వైసీపీ నేతలకు టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. షర్మిల ఏపీలో పార్టీ పెడితే, అందులో చేరి జగన్ను బూతులు తిట్టే మొదటివ్యక్తి కొడాలినాని అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. ప్రజలకు మేలు చేయటం చేతకాకే.. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. గుడివాడలో బస్సులు, లారీల్లో కొడాలి నాని ఆయిల్ దొంగతనం చేస్తే, అప్పుడు పోలీసు అధికారిగా ఉన్న వర్ల రామయ్య చర్యలు తీసుకోలేదా..? అని అయి ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు సీఎం అయ్యాకే కొడాలి నానికి టీడీపీలో స్థానంలో దక్కిందని, హరికృష్ణ గుడివాడలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే, మధ్యలో వదిలేసి పారిపోయిన వ్యక్తి కొడాలి నాని అని ఎద్దేవా చేశారు. కొడాలి నాని లేదా మరెవ్వరైనా చంద్రబాబు గురించి మాట్లాడితే మేం జగన్ గురించి 10రేట్లు మాట్లాడతాఅని, జోగి రమేష్ లా మళ్లీ చంద్రబాబు ఇంటి వైపు ఎవరైనా చూస్తే చావకొట్టి పంపుతామంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. డీజీపీకి కూడా కొడాలినాని నిర్వహించిన క్యాసినోలో వాటాలు ఉన్నందుకే కేసు తొక్కిపెట్టారని, డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీగా డీజీపీ వ్యవహరిస్తున్నారన్నారు.