గుడివాడ క్యాసినో ఘటన రోజురోజుకు ముదురుతోంది. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ పేరు చేబితే మొన్నటి వరకు గంజాయి, డ్రగ్స్ గుర్తుకు వచ్చేవని.. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పెరు చెబితే గుడివాడ , అందులో క్యాసినో గుర్తుకొస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. అన్ని విధాలా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు సూపర్ సీఎం జగన్ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. కానీ కొడాలి నాని గారు మాత్రం కరోనా తో హైదరాబాద్లో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాను అంటున్నారు. మరి ఆ రోజు క్యాసినో లో టెంట్ లు వైసీపీ జెండా రంగులే ఉన్నాయి.. మరి ఇన్ని ఆధారాలు ఉన్నా ఆ మంత్రి తనకు సంబంధం లేదు అంటున్నారు… సినిమా టిక్కెట్ పది రూపాయాలు చేశారు.. క్యాసినో మాత్రం 10వేలు టికెట్ పెట్టారు. దీనిని కూడా పేదలకు అందుబాటులో తెస్తారా…? అని ఆమె ప్రశ్నించారు.
సీఎం జగన్ ఉండే తాడేపల్లి కూత వేటు దూరంలో ఉన్న నోరు ఎందుకు విప్పారు. విశాఖ లో బీచ్ లవ్ ఫెస్టివల్ పెడితే …ఇదే జగన్, రోజాలు.. ఇద్దరు కలిసి విమర్శలు చేసారు. దానికి అప్పటి సీఎం గా ఉన్న చంద్రబాబు సంస్కృతి విఘాతం కల్గించే చర్యలు జరగవు అని మాట్లాడారు. మరి ఇప్పుడు సీఎం జగన్ ఎందుకు సమాధానం చెప్పరు. మంత్రి కొడాలి నాని ని వెంటనే బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. క్యాసినో చేపట్టిన వారిని అరెస్ట్ చేయాలి. దీని పై చర్య తీసుకోక పోతే చలో గుడివాడ చేపట్టి సమాధానం చెప్తా. తాడేపల్లి సీఎం జగన్ ఇంటిని కూడా ముట్టడి చేస్తాం… తాడేపల్లి ప్యాలెస్ కు ఎంత వాటా వెళ్ళింది.? క్యాసినో వ్యవహారం లోడీజీపీకి ఎంత వాటా వెళ్ళింది.? అని ఆమె ప్రశ్నించారు.