గుడివాడ ఘటనపై వైసీపీ,టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానలా తయారైంది. తాజాగా టీడీపీ రాష్ట్రం కార్యదర్శి బుద్ధా వెంకన్న మంత్రి కోడలి నాని నిన్న చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. 2024లో వైసీపీ ఓడిపోయిన అరగంటలో ప్రజలు నిన్ను చంపుతారని, ఓడిపోగానే రాష్ట్రం వదిలి దుబాయి పారిపోతావు అంటూ ఎద్దేవా చేశావు. క్యాసినోలో రూ. 250 కోట్లు చేతులు మారాయి.. డీజీపీ నీకు వాటా ఎంత..? కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు..? 70 సంవత్సరాల వయస్సున్న చంద్రబాబును నా కొడకా అంటే డీజీపీ ఎందుకు మాట్లాడరు..? అని ఆయన ప్రశ్నించారు. కొడాలి నాని అండ్ కో జగన్ పార్టీని సర్వనాశనం చేశారని, నీ లాంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వడమే చంద్రబాబు చేసిన పొరపాటు అని ఆయన మండిపడ్డారు.
నీకు దమ్ము ఉంటే పోలీసులు లేకుండా చంద్రబాబు ఇంటికి రా.. నీ శవాన్ని పంపుతాము.. లేకపోతే మేము చస్తాము.. అని సవాల్ విసిరారు. గుట్కా తిని క్యాన్సర్ వచ్చి చస్తావు. ఒక పార్టీ తొత్తుగా వ్యవహరించే డీజీపీ దేశంలో’నే మరెవరూ లేరు. డీజీపీ ఎక్కడ ఉన్నా.. వదిలే ప్రసక్తే లేదు. నన్ను ఏమి చేసుకుంటారో చేయండి. కొడాలి నాని కులాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి అయ్యావు. కొడాలి నాని ఒళ్ళు దగ్గర పెట్టుకో. చంద్రబాబు ఇంటిదగ్గరకు వస్తే చావగొట్టి పంపుతామని వార్నింగ్ ఇచ్చారు. సైనికుల్లా చంద్రబాబుని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వ్యభిచారం చేయించింది కొడాలి నాని అంటూ ఆయన వ్యాఖ్యానించారు.