గత బుధవారం పల్నాడు జిల్లా కేంద్రంలోని నరసరావుపేటలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతు ఓ హస్పిటల్‌పై ఫ్లెక్సీలు కట్టారు. అయితే స్వాగతం పలుకుతూ కట్టిన ఫ్లెక్సీని టీడీపీ ఇన్ ఛార్జ్ చదలవాడ అరవిందబాబు తమ్ముడు హాస్పిటల్ పై ఏర్పాటు చేయడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. ఫ్లెక్సీ తొలగింపును తప్పు పట్టారు. అనుమతి తీసుకునే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పటికీ ఫ్లెక్సీలను టీడీపీ నేతలు తొలగించడం సబబు కాదన్నారు. అయితే ఇప్పటికీ నరసరావుపేటలో ఫ్లెక్సీల వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఫ్లెక్సీల వివాదంలో టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద బాబుతో పాటు మరో ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోజు అరవింద బాబు, టీడీపీ కార్యకర్తలకు వన్ టౌన్ పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.