వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో 1986 తర్వాత ఇంత పెద్ద స్థాయిలో గోదావరికి వరదలు వచ్చాయని.. నిన్ననే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లి పరామర్శించి వచ్చారని.. సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఉండాలని ముందు రాలేదని సీఎం చెప్పారని గుర్తుచేశారు.. ఇక, 3.60 లక్షల మందిని పునరావాస కేంద్రాల్లో ఉంచాం, ఇప్పటికీ సహాయక చర్యలు…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ కేబినెట్‌తో పాటు చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జేఆర్ పుష్పరాజు కన్నుమూశారు.. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోన్న ఆయన.. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.. అయితే, ఇవాళ ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచారు.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగారు.. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. తాడికొండ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పుష్పరాజు.. స్వర్గీయ…
చికోటి ప్రవీణ్‌తో వైసీపీ నేతలకు కూడా సంబంధాలున్నాయని ఆరోపించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితర ఇళ్లలో కూడా ఈడీ సోదాలు జరపాలని డిమాండ్ చేశారు
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… పది స్థానాల్లోనూ వైసీపీ కార్పొరేటర్లు విజయం సాధించారు.. అయితే, టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుంది.. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. ఈ ఎన్నికల్లో 98 డివిజన్లకు గాను 93 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.. మొత్తంగా పదికి పది స్థానాలను వైసీపీ కైవసం…
తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది… హోంశాఖ మంత్రి తానేటి వనితకు తన సొంత ఇలాకాలో చేదు అనుభవం ఎదురైంది… ఆమె సొంత నియోజకవర్గం కొవ్వూరులో అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది… అసలు వైసీపీ అభ్యర్థులు పోటీలో కనిపించకుండా పోవడం చర్చగా మారింది.. మొత్తంగా.. 11 డైరక్టర్ స్థానాలు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు టీడీపీ అభ్యర్థులు… ఆ పార్టీ నేత మద్దిపట్ల శివరామకృష్ణను చైర్మన్‌గా ఎన్నుకున్నారు డైరెక్టర్లు.. దీంతో,…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సినీ నటుడు మోహన్‌బాబు భేటీ అయ్యారు.. ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయాలపై దాదాపు రెండు గంటల పాటు చర్చించినట్టు సమాచారం.. దశాబ్ధ కాలంగా చంద్రబాబుతో మోహన్‌బాబుకు గ్యాప్ ఉంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ.. ఓ రేంజ్లో ఫైర్ అయ్యేవారు మోహన్‌బాబు.. ఆయన పేరు ఎత్తితేనే భగ్గుమనేవారు.. కానీ, తాజా సమావేశం ఆసక్తికరంగా…