Social Media Fake Posts: టీడీపీపై తప్పుడు ప్రచారం..! విజయసాయిరెడ్డిపై సీఐడీకి టీడీపీ ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ విజయ సాయిరెడ్డి, గుర్రంపాటి దేవేంధర్ రెడ్డిలపై సీఐడీ ఏడీజీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు లేఖ రాసిన ఆయన.. లేఖలో.. టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి నారా లోకేష్‌పై తప్పుడు ప్రచారం చేశారు. రెండు రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం, ద్వేషం పెంచడమే దేవేంద్ర రెడ్డి ఉద్దేశంలా కనిపిస్తుందని.. సామాజిక మాధ్యమాల్లో దేవేందర్‌రెడ్డి ప్రచారం చేసినట్లుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 273, 274, 275, 276 సర్వే నంబర్లే లేవు.. వైసీపీ నాయకులు ప్లాట్ నెం. 3, రోడ్ నంబర్. 12, బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీ, హైదరాబాద్ నుంచి నిరాధారమైన ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు.
Read Also: MP Gorantla Madhav Issue: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై విచారణ.. కఠిన చర్యలు తప్పవు..!
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ఇక, 3 ఆగస్టు 2022న ఏ2 విజయ సాయి రెడ్డి సైతం టీడీపీ నాయకుల హత్యారాజకీయాల పేరుతో తప్పుడు ప్రచారం చేశారని లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య.. 3 ఆగస్టు 2022న టీడీపీ నాయకులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, అశోక్ బాబు దీనిపై పిర్యాదు చేసేందుకు మంగళగిరి రూరల్ సీఐ భూషణంని సంప్రదించిగా ఆయన బాధ్యతారాహత్యంగా ప్రవర్తించారని తెలిపారు.. సీఐ తన ప్రాథమిక బాధ్యతలను విస్మరించి మా నాయకులపై అసభ్యకరంగా దుర్భాషలాడారని పేర్కొన్నారు. మీడియాతో కూడా మాట్లానివ్వకుండా వారిని బలవంతంగా అక్కడ నుంచి ఖాళీ చేయించారని.. ఇప్పటి వరకు మా ఫిర్యాదుపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో నిందితులపై చర్యలు తీసుకునేందుకు స్థానిక పోలీసులు ఆసక్తి చూపడం లేదన్న ఆయన.. అధికార పార్టీ నేతలపై అనేకసార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న దేవేంద్ర రెడ్డి, విజయసాయి రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులపై అసభ్యంగా ప్రవర్తించినందుకు సీఐ భూషణంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని లేఖలో సీఐడీ ఏడీజీకి విజ్ఞప్తి చేశారు వర్ల రామయ్య.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు