విజయవాడ ఎంపీ కేశినేని నాని సోదరుడు, తెలుగుదేశం పార్టీ నేత కేశినేని చిన్ని ఇవాళ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణతో సమావేశం అయ్యారు.. హైదరాబాద్ వేదికగా ఇద్దరు నేతలు సమావేశం జరిగింది.. తన సోదరుడు కేశికేని నాని.. ఎంపీగా రెండు సార్లు విజయం సాధించడంలో కీలకంగా పనిచేసిన ఆయన.. సోదరుడితో విబేధాల తర్వాత వార్తల్లో నిలిచారు.. ఇక, ఈ నేపథ్యంలో వంగవీటితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.. బెజవాడ రాజకీయాలు.. టీడీపీలో ప్రస్తుత పరిస్థితులు, తాజా పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది..
Read Also: Common Wealth Games 2022: కామన్‌వెల్త్‌లో భారత్.. ఇవాళ జరిగే పోటీలు ఇవే..
కాగా, తన ఎంపీ స్టిక్కర్ ను చిన్ని ఉపయోగించడంపై ఎంపీ కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. టీఎస్ 07హెచ్ 7777 అనే నెంబర్ గల వాహనానికి తన ఎంపీ స్టిక్కర్ అంటించుకుని.. బెదిరింపులకు పాల్పడుతున్నాడని.. అక్రమంగా తన ఎంపీ స్టిక్కర్‌ను వాడుతున్నాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు కేశికేని నాని.. ఇక, ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు.. వాహనాన్ని తిరిగి కేశినేని చిన్నికి ఇచ్చేశారు.. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చిన్ని.. ఆ వివాదంపై స్పందిస్తూ టీడీపీలో తానొక చిన్న కార్యకర్తనని, చంద్రబాబు సీఎం కావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.. ఆటోనగర్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరపాలని భావించానని, కానీ, దానిని కూడా వివాదాల్లోకి లాగారన్నారు. ఓ చిల్లర వివాదంలోకి ఎంపీ కేశినేని నాని తన కుటుంబాన్ని లాగడం బాధాకరమన్నారు చిన్ని… మొత్తంగా.. ఇప్పుడు వంగవీటి రాధా, కేశినేని చిన్ని భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.