గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది.. పార్టీకి రాజీనామా చేశారు గంజి చిరంజీవి.. పదవులు కోసం, పరపతి కోసం టీడీపీకి రాజీనామా చేయడం లేదు, సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేక రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
పార్టీలో యువతకు ప్రాతినిధ్యంపై టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో చర్చ లేవనెత్తారు లోకేష్.. దీంతో, ఆయన సూచనలపై సమగ్ర అధ్యయననానికి కమిటీ ఏర్పాటు చేయాలని తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి తానేటి వనిత… రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్లో విచారణలో ఉందని తెలిపారు.. ఫోరెన్సిక్ నివేదిక త్వరగానే వస్తుందని.. అది నిజమని తేలితే శిక్ష, చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు… అయితే, ఈ ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. టీడీపీ మహిళా నేతలు మాటలు, బాడీ లాంగ్వేజ్…
ఓ వెధవ పనిచేసి బహిరంగంగా ఎవ్వరూ తిరగలేరన్న చంద్రబాబు.. సిగ్గులేని వాళ్లే చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు కులమతాలను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.. ఇలాంటి ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.. ఎంపీ మాధవ్కు సంబంధించినదంటూ ఓ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఇక, దానిపై స్పందించిన వైసీపీ ఎంపీ.. అది మార్ఫింగ్ చేశారని.. తాను ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు.. వారే కుట్రపూరితంగా నా ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.…
టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ విజయ సాయిరెడ్డి, గుర్రంపాటి దేవేంధర్ రెడ్డిలపై సీఐడీ ఏడీజీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.