పడవ ప్రమాద ఘటనను టీడీపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు హోంమంత్రి తానేటి వనతి.. తెలుగుదేశం పార్టీ నేతలు అడిగితే ఈ ఘటనపై విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా నిలిచింది. రాష్ట్రం నుంచి వంద శాతం ఓట్లు ద్రౌపది ముర్ముకే పడ్డాయి. మొత్తం 173 ఎమ్మెల్యేల ఓట్లు ఉండగా... అన్నీ ఒకే అభ్యర్థికి వేసిన రాష్ట్రంగా నిలిచింది ఏపీ.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లా పర్యాటనలో అపశృతి చోటు చేసుకుంది.. రాజోలు మండలం సోంపల్లి రేవులో బోటు దిగుతుండగా నీటిలో పడిపోయారు టీడీపీకి చెందిన 15 మంది నేతలు.. చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది.. మాజీ మంత్రులు, టీడీపీ నేతలు నీటిలో పడిపోయారు.. దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, రాధాకృష్ణ, అంగర రామ్మోహన్, మంతెన రామరాజు నీటిలో పడి తడిసి ముద్దయ్యారు.. ఇందులో పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.. నీటిలో పడినవారిలో పోలీసు…
ఎంతో కాలంగా నా పేరుతో నకిలీ కారు స్టిక్కర్ ను ఉపయోగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఎంపీ స్టిక్కర్ పేరుతో బెదిరింపులు, మోసాలకు పాల్పడుతున్నారని తన సోదరుడిపై ఆరోపణలు గుప్పించారు ఎంపీ కేశినేని నాని
తెలుగు దేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది.. పార్టీలోని విభేదాలు, ఎన్నికల్లో పోటీ విషయం ఇలా ఎన్నో సందర్భాల్లో అలకలు, బుజ్జగింపులుగా సాగుతూ వస్తోంది.. ఇప్పుడు కేశినేని ఫ్యామిలీలో చిచ్చు మొదలైంది.. టీడీపీ సీనియర్ నేత, ఎంపీ కేశినేని నాని తన సోదరుడైన కేశినేని చిన్నిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చగా మారింది.. తన పేరు, హోదాను అడ్డుపెట్టుకుని గుర్తు తెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని, నకిలీ వీఐపీ…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. ఓట్లు, సీట్ల గురించి సవాళ్లు, ప్రతి సవాళ్లు వినిపిస్తున్నాయి.. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే.. ఈ సారి ఎక్కువగా వస్తాయని.. రాష్ట్రంలోని 175 స్థానాలకు 175 తామే గెలుస్తామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నమాట.. అయితే.. రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 కాదు కదా.. 17 సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ…
ఆంధ్రప్రదేశ్‌లో మరో టీడీపీ నేతపై దుండగులు దాడి చేశారు.. ఇప్పటికే ఏపీలో పలువురు టీడీపీ నేతలు హత్యకు గురయ్యారు.. కొందరు తృటిలో తప్పించుకున్నారు.. వారి హత్యకు కారణాలు ఏమైనా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.. అయితే, తాజాగా మరో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది.. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి పై దాడికి పాల్పడ్డారు దుండగులు.. అలవల గ్రామంలో మార్నింగ్ వాక్ కు వెళ్లిన…