తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. తన సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటించే ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఏర్పాటుచేశాయి ఆ పార్టీ శ్రేణులు.. రామకుప్పం మండలం కొల్లుపల్లెలో వైసీపీ జెండాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు, అంతేకాదు దారి పొడువునా వైసీపీ తోరణాలు కట్టారు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. పోలీసుల సహకారంతోనే…
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానంటున్నారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు.. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ అనేది కొద్ది రోజుల్లో తెలియజేస్తా అంటున్నారు.. అంతే కాదు.. తాను ఒక్క నియోజక వర్గానికి పరిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా నేను చేరే పార్టీకి మేలు జరిగేలా కృషి చేస్తానన్నారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై ఫైర్ అవుతున్నారు వైసీపీ నేతలు.. తాజాగా, పవన్ చేసిన వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కామెంట్లపై ఘాటుగా స్పందిస్తున్నారు ఆ పార్టీ నేతలు.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి అమర్నాథ్… పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో పుట్టిన రోజు నాడు చిరంజీవికి వేదన మిగులుస్తున్నారన్నారు.. కొణిదెల పవన్ కల్యాణ్ అనాలో.. నారా, నాదెండ్ల పవన్ కల్యాణ్ అనాలో కూడా అర్ధం కావడం లేదన్న ఆయన.. మెగాస్టార్ కుటుంబంలో అమ్ముడిపోయే వ్యక్తి ఉన్నందుకు బాధపడుతున్నాం..…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆరోపణలు గుప్పించారు ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా… మా వ్యూహాలు మాకు ఉంటాయి.. ఎప్పటికప్పుడూ అవి మారుతూ ఉంటాయి.. మొత్తంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తామంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై స్పందించిన ఆయన.. పవన్ కల్యాణ్‌కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయ్యింది అంటూ విమర్శలు గుప్పించారు.. బీజేపీతో సంసారం.. చంద్రబాబుతో శృంగారం ఇదీ పవన్ పార్టీ పరిస్థితి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దాడిశెట్టి.. అది జనసేన…
Nara Lokesh taken into custody in Srikakulam: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ను శ్రీకాకుళం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ పలాసాలో పర్యటించనున్న నేపథ్యంలో శ్రీకాకుళం పట్టణంలోని కొత్త రోడ్డులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలాసకు వెల్లకుండా లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర ఆగ్రహంతో.. పార్టీ శ్రేణులు రోడ్డుపైనే లోకేష్ బైఠాయించారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. నారా లోకేష్ వాహనం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా మొహరించారు.…
నేడు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలాసాలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఏంజరుగుతోందన్న టెన్షన్ నేపథ్యంలో.. నేడు శ్రీకాకుళం పట్టణంలోని కొత్త రోడ్డులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలాసకు వెల్లకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర ఆగ్రహంతో.. పార్టీ శ్రేణులు రోడ్డుపైనే లోకేష్ బైఠాయించారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. నారా లోకేష్ వాహనం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా మొహరించారు. అనుమతించాలని కోరుతూ.. రోడ్డు బైఠాయించి…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.. విశాఖలో వైసీపీ నేతలు గంటకో ఘోరం, అరగంటకో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన.. 420 పార్టీలో విజయసాయిరెడ్డి, కొడాలి నాని లాంటి వాళ్లు 840లు అంటూ ఎద్దేవా చేశారు.. విశాఖలో వృద్ధాశ్రమ భూముల్నీ వైసీపీ నేతలు వదలట్లేదని విమర్శించారు.. విశాఖలో వైసీపీ సాగించిన భూ కబ్జా బాధితుల కోసం ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు…
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాడు అమరావతి గ్రాఫిక్స్ సృష్టించారు.. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై గ్రాఫిక్స్ చేయిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్‌పై ఆయన స్పందిస్తూ… నాలుగు రోజుల్లో నిజాలు బయటకు వస్తాయి.. గ్రాఫిక్స్ చేసింది ఎవరో బయటపడుతుందన్నారు.. ఇక, ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని…