1. నేడు ఏపీ అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చ. సభలో 8బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. విద్యా, వైద్యం, నాడునేడుపై స్వల్పకాలిక చర్చ. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.
2. నేడు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు. అంత్యక్రియల్లో పాల్గొననున్న వివిధ దేశాధినేతలు, ప్రముఖులు.
3. ఏపీలో నేడు విదేశీ ప్రతినిధుల బృందం పర్యటన. ప్రకృతి సాగుపై అధ్యయనం చేయనున్న విదేశీ ప్రతినిధులు.
4. నేడు 12వ రోజు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర. వున్నప్ర అరవుకడ్ టెంపుల్ నుంచి రాహుల్ జోడో యాత్ర. వడకల్ మత్య్సగుడి బెట్టీలో మత్య్సకారులతో రాహుల్‌గాంధీ భేటీ.
5. నేటి నుంచి ఏపీలో బీజేపీ ప్రజాపోరు యాత్ర. ఏపీ వ్యాప్తంగా 5వేల సభలు నిర్వహించనున్న బీజేపీ. విశాఖలో సాయంత్రం బీజేపీ తొలి సభ.
6. రైతు సమస్యలపై నేడు టీడీపీ ఆధ్వర్యంలో ఏపీలో నిరసన. నిరసనలో పాల్గొననున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
7. నేడు బీజేపీలో చేరనున్న పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్. పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బీజేపీలో విలీనం చేయనున్న అమరీందర్‌సింగ్.